మరో మూడు రోజుల్లో థియేటర్లో మోస్ట్ వైలెంట్ మ్యాన్‌ను చూడబోతున్నాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్(Animal) సినిమా సాలిడ్ బజ్‌తో రిలీజ్ కాబోతోంది. బిజినెస్ కూడా అలాగే జరిగింది. మరి యానిమల్ తెలుగు టార్గెట్ ఎంత?
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి(sandeep reddy vanga) నుంచి వస్తున్న సినిమా ‘యానిమల్(Animal)’. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్లోకి రానుంది. తెలుగులో యానిమల్కు మంచి క్రేజ్ ఉంది. తెలుగు డైరెక్టర్ కావడం, రష్మిక మందన్నకి తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో.. ఇక్కడ కూడా భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దాదాపు రూ.15 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్ర, నైజాం ప్రాంతాలలో దిల్ రాజు(dil raju) సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ రెండు ప్రాంతాల మినహాయించి.. మిగతా ప్రాంతాలలో దాదాపు రూ.6 కోట్ల వరకు హక్కులను అమ్మేసినట్టు తెలుస్తోంది.
అంటే.. నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో రూ.9 కోట్లు కలెక్ట్ చేస్తే యానిమల్ హిట్ కొట్టినట్టే. అలాగే మిగతా ఏరియాల్లో రూ.6 కోట్లు పెద్ద విషయమేమి కాదు. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే.. ఇదేం పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హైదరాబాద్(hyderabad)లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుతున్నాయి. దీంతో సినిమాకు హిట్ టాక్ వస్తే.. దిల్ రాజుకు యానిమల్ భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ. మరి యానిమల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.