Chiru పార్టీ పెట్టి వెయ్యి కోట్లు సంపాదించారు: మన్సూర్ అలీఖాన్
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్ల సంపాదించారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ విమర్శలు చేశారు. త్రిష ఇష్యూలో పరువు నష్టం దావా కూడా వేస్తానని స్పష్టంచేశారు.
Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై కామెంట్స్ చేసి, సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan). ఆ తర్వాత కూడా ఆ వివాదాన్ని కొనసాగిస్తున్నారు. అవును.. త్రిషపై మన్సూర్ (Mansoor) కామెంట్లను మెగాస్టార్ ఖండించారు. అతను వక్రబుద్ది కలిగిన వ్యక్తి అని విమర్శించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరుపై మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) పడ్డారు.
ఎవరిదీ వక్రబుద్ది అని అలీ (Mansoor Ali Khan) ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్ల సంపాదించారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ డబ్బును తన సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. మరి జనం కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని అడిగారు. దీనిని బట్టి చిరంజీవిది వక్రబుద్ది అని విమర్శించారు. తనపై అకారణంగా విమర్శలు చేసిన చిరంజీవిపై రూ.20 కోట్లు, త్రిష, ఖుష్బూపై రూ.10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.
ఆ దావా వేయడంతో వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తానని చెప్పారు. త్రిష (Trisha) ఇష్యూ విషయంలో చిరంజీవి (chiranjeevi) తప్పు చేశారని కామెంట్స్ చేశారు. ఏం జరిగిందో తనకు ఫోన్ చేసి అడిగి ఉంటే బాగుండేదని సూచించారు. అలా చేయకుండా విమర్శించడం సరికాదని కామెంట్స్ చేశారు.