»Omkar On Ott Web Series Mansion 24 First Look Release
Omkar: ఓటీటీపై కన్నేసిన ఓంకార్..మాన్షన్ 24 ఫస్ట్ లుక్ రిలీజ్
టీవీ యాంకర్ ఓంకార్ తాజాగా మరో స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. ఆయన కొత్తగా రూపొందించిన మూవీ ప్రాజెక్టు 'మాన్షన్ 24(Mansion 24)'. ఈ తెలుగు వెబ్ సిరీస్(telugu web series) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పొస్టర్ ఆకట్టుకుంటుంది.
Omkara on OTT web series Mansion 24 first look release
టీవీ యాంకర్ ఓంకార్(Omkar) గురించి తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆయన టీవీ యాంకర్ గా చాలా ప్రోగ్రాంలు చేశాడు. తన తమ్ముడితో కూడా సినిమాలు చేశాడు. రాజుగారిగది 3 తర్వాత నాలుగేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఓంకార్ ఓ హారర్ వెబ్‌సిరీస్‌తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. వినాయకచవితి సందర్భంగా ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ హారర్ వెబ్‌సిరీస్‌కు మ్యాన్షన్ 24(Mansion 24) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ బైలింగ్వల్ వెబ్‌సిరీస్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖంతో పాటు చీకటితో నిండిన ప్రదేశంలో ఓ పురాతన బిల్డింగ్‌ను చూపిస్తూ డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.
ఈ వెబ్‌సిరీస్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు బిగ్‌బాస్ విన్నర్ బిందుమాధవి, అవికా గోర్, మానస్, అమర్దీప్ చౌదరి, విద్యుల్లేఖరామన్ కీలక పాత్రలను పోషించనున్నారు. వీరితో పాటు తెలుగు, తమిళ భాషలకు చెందిన సీనియర్ నటులు మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్‌లో కనిపించబోతున్నారు. మ్యాన్షన్ 24 వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్(telugu web series)స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేయబోతున్నారు. ఓ పురాతన భవంతిలో అడుగుపెట్టిన కొందరు యువతీ యువకులకు ఎదురైన పరిణామాలతో ఈ వెబ్‌సిరీస్ సాగబోతున్నట్లు సమాచారం. ఓంకార్ దర్శకత్వం వహించిన రాజుగారి గది సినిమా తరహాలోనే మ్యాన్షన్ 24 సిరీస్ ఉంటుందని చెబుతున్నారు. మ్యాన్షన్ 24కు ఓంకార్ నిర్మాతగా వ్యవహరించినట్లు తెలిసింది.