యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి టీవి షోలు చేసుకుంటున్న ఓంకార్.. త్వరలోనే 'మాన్షన్ 24' అనే సిరీస్‌తో రాబోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ట్రైలర్‌తోనే భయపెట్టేశాడు ఓంకార్.
Mansion 24: రాజు గారి గది సిరీస్ సినిమాలతో హారర్ కామెడీతో మెప్పించిన యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్.. ఇప్పుడు మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్‌తో రాబోతున్నాడు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24లో.. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిముషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా భయపెట్టేలా ఉంది.
వరలక్ష్మీ తండ్రిగా సత్యరాజ్ కాళిదాస్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక కాళిదాస్ మిస్ అవ్వడంతో అతని మీద దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. దీంతో.. అతని కూతురు వరలక్ష్మీ తన తండ్రిని ఎక్కడున్నాడో తెలుసుకొని.. దేశద్రోహి కాదని నిరూపించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఒకసారి వెళితే తిరిగి రాని మ్యాన్షన్ 24 అనే ఒక పాడుబడ్డ మ్యాన్షన్‌లో తన తండ్రి మిస్ అయ్యాడని తెలుసుకుంటుంది. అలాంటి మ్యాన్షన్‌లోకి అడుగు పెట్టిన వరలక్ష్మీకి చెమటలు పట్టించే సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌లోని హారర్ సీన్స్ వణికించేలా ఉన్నాయి. ఇక ట్రైలర్ ఇలా ఉంటే.. సిరీస్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సిరీస్ అదిరిపోతుందని ట్రైలర్‌తో చెప్పేశాడు ఓంకార్. ఈ ట్రైలర్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇక ఈ సిరీస్‌కి ఓంకార్ దర్శకుడుగా వ్యవరిస్తూనే అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తితో కలిసి నిర్మించారు.