పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘OG’. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తూ మూవీ యూనిట్ ఓ కవర్ పోస్టర్‌ను విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి మరణ మృదంగం మోగించిన OGని ఈ పోస్టర్లో డార్క్ మోడ్‌లో చూపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.