ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ‘దేవర’. ఈ సినిమా రెండో ట్రైలర్ను ఇవాళ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ను ముందు చెప్పినట్లుగా ఉదయం 11:07 గంటలకు విడుదల చేయట్లేదని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. దీంతో ఇటీవల ‘ఆయుధ పూజ’ పాట విషయంలో కూడా ఇలాగే చేశారంటూ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది.