Guntur Karam: కేరళ కాదు..’గుంటూరు కారం’ సాంగ్ లొకేషన్ మారింది?
అతడు, ఖలేజా తర్వాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కేరళలో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్టుగా తెలుస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. పండగ సీజన్ కాబట్టి.. టాక్‌తో సంబంధం లేకుండా రీజనల్ బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం(Guntur Karam) భారీ వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ. ఇప్పటికే తమన్ ఇచ్చిన దమ్ మసాలా మాస్ బీట్ రిలీజ్ చేసిన మేకర్స్.. వచ్చే మండేకి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు, మీనాక్షి చౌదరిలపై కొన్ని సీన్స్ అండ్ ఒక సాంగ్ షూట్ చేసారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ సాంగ్‌ని కేరళలో మహేష్ బాబు అండ్ శ్రీలీలపై షూట్ చెయ్యడానికి రెడీ య్యారు.
డిసెంబర్ 25 వరకు ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమాకు ప్యాకప్ చెప్పనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ లొకేషన్ మరో చోటికి మారినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో పరిస్థితులు అనుకూలంగా లేవట. దీంతో పాట చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీకి మార్చినట్టుగా సమాచారం. ఈ నెల 10 నుంచి మహేష్ బాబు ఈ సాంగ్ షూట్లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. అయితే సినిమా రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్.
అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అని టెన్షన్ పడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. పైగా న్యూ ఇయర్ వెకేషన్‌కు ఫారిన్ వెళ్లనున్నాడు మహేష్ బాబు(mahesh babu). కాబట్టి.. ఈసారైనా గుంటూరు కారం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో? లేదో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సంక్రాంతికి బాబు రావడం పక్కా అంటున్నారు.