గతేడాది చివర్లో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అలాగే ఇటీవల వచ్చిన ‘అంటే సుందరానికి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మాసివ్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. ‘దసరా’ అనే సినిమాను చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తెలంగాణ యాసలో సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కితోంది. ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో ఊరమాస్‌గా కనిపించనున్నాడు నాని. వచ్చే ఏడాది మార్చి 30న ‘దసరా’ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా నుంచి మాసివ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ దసరా పండ సందర్భంగా.. ధూమ్ ధామ్ దోస్తానా అంటూ సాగే ఫస్ట్ మాస్ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో అదిరిపోయేలా ఉంది. దాంతో దసరా నుంచే నాని ధూమ్ ధామ్ మొదలవనుందని చెప్పొచ్చు. ఇక సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా.. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై.. నాని కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దాంతో ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. మరి దసరా మూవీతో నాని ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తాడో చూడాలి.