టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఎమోషనల్ పోస్టు చేశారు. తన కొడుకు గౌతమ్ ను ఉద్దేశిస్తూ నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాలో ఓ పోస్టు చేశారు. గౌతమ్ తనను వదిలి మొదటిసారి ఫారెన్ టూరికి వెళ్తున్నాడని తెలిపారు. తనలో ఓ భాగం దూరం అవుతున్నట్లుగా అనిపిస్తోందని నమ్రత ఎమోషనల్ అయ్యారు.
కల్చర్ ట్రిప్ లో భాగంగా గౌతమ్ వెళ్తున్నాడని, తాను లేని రోజంతా శూన్యంగా గడిచిందని నమ్రత అన్నారు. గౌతమ్ తిరిగి ఇంటికి వచ్చే వరకూ తన బాధ తీరదన్నారు. ఈ వారం అంతా గౌతమ్ సరదాగా, సంతోషంగా, సాహసాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ట్రిప్ గౌతమ్ కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గౌతమ్ రాక కోసం ఎదురుచూస్తున్నానంటూ నమ్రత పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.