ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు మండల లెవల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై సర్తాజ్ పాషా ప్రకటనలో తెలిపారు. బెజ్జూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆసక్తిగల యువకులు పోలీస్ స్టేషన్లో పేర్లను నమోదు చేసుకోవాలని SI సూచించారు.