Kalki 2898 AD: ఆ విషయంలో సీరియస్ గా ఉన్న నాగ్ అశ్విన్..!
కల్కీ ట్రైలర్ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీరియస్గా ఉన్నాడని తెలిసింది. ఫస్ట్ లుక్ మీద ట్రోల్స్ రావడంతో.. అలాంటి సిచుయేషన్ రాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 AD. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, అది విపరీతంగా ఆకట్టుకుంది. మొదట ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి చాలా విమర్శించారు. చీప్ ఎడిటింగ్, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని కొందరు, మరో ఆదిపురుష్ అవడం ఖాయమంటూ ట్రోల్ చేశారు. టీజర్ చూసిన తర్వాత, అందరూ షాకయ్యారు.
టీజర్ బాగుందనే కామెంట్స్ వినిపించాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. టీజర్ పై లెన్స్ వేసి వెతికి ట్రోల్ చేసినవారు కూడా ఉన్నారు. వాటిపై ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫోకస్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వచ్చాయి..? నెక్ట్స్ టైమ్ అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బెటర్ అనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారట.
త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. ఆ లోపు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పర్ఫెక్ట్గా ట్రైలర్ విడుదల చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారట. మొన్నటి లాగా కాకుండా, ట్రైలర్ మరింత అదిరిపోయేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కూడా రెండు భాగాలుగా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు మే 9వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ రోజే విడుదల చేయడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఈ మే 9వ తేదీన నిర్మాత అశ్వినిదత్కి చాలా స్పెషల్ రోజు అట. నిర్మాణ రంగం నుంచి వచ్చిన జగదీక వీరుడు అతి లోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఆ రోజున విడుదల చేస్తే కల్కీ కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.