»My Baby Jacqueline Jailed Conmans Love Note For Actor On His Birthday
Jaqueline Fernandez: జైలు నుంచి హీరోయిన్‌కు లవ్ లెటర్..మరోసారి వార్తల్లో నిలిచిన సుఖేష్
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) తన లవర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jaqueline Fernandez)కు ప్రేమ లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాక్వెలిన్ ను కూడా ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు. అంతేకాకుండా మరో యాక్టర్ నోరా ఫతేహిని కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) తన లవర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jaqueline Fernandez)కు ప్రేమ లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేయడంతో ఈడీ(ED) అధికారులు సుఖేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్(Bollywood) యాక్టర్, సుఖేష్ ప్రేయసి అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ప్రేమ లేఖ(Love letter) రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు.
‘నా బేబీ జాక్వెలిన్(Jaqueline)..నేను నా పుట్టినరోజున నిన్ను మిస్ అవుతున్నాను. నా చుట్టూ ఉన్న నీ ఎనర్జీని కోల్పోతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నాపై నీ ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. నాకు ప్రూవ్స్ కూడా అవసరం లేదు బేబీ’ అంటూ జాక్వెలిన్(Jaqueline)పై ప్రేమను వ్యక్తం చేశాడు. జాక్వెలిన్ ప్రేమను తన జీవితంలో అద్భుతమైన బహుమతిగా తెలిపాడు. తనకు ప్రేమను పంచినందుకు జాక్వెలిన్ కు థ్యాంక్స్ చెప్పాడు.
ఈ నెల ప్రారంభంలో కూడా సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) జాక్వెలిన్ కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ ను రాశాడు. ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాక్వెలిన్(Jaqueline Fernandez)ను కూడా ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు. అంతేకాకుండా మరో యాక్టర్ నోరా ఫతేహిని కూడా ఈడీ(ED) విచారించిన సంగతి తెలిసిందే.