What happened in that village on August 16, 1947? Full description of the movie
August 16 1947: డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం ఆగస్ట్ 16 1947. సినిమా ఓపనింగ్ సీన్ బ్రిటిష్ ఫ్లాగ్ మీదు వాయిస్ ఓవర్ తో మొదలు అవుతుంది. 300 ఏళ్లుగా భారత్ ను పరిపాలించిన బ్రిటిష్ పాలకులు ఎన్నో పోరాటాల తరువాత స్వతంత్య్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇండియాను వదిలిపోయే ముందు భారత్ లో దోచుకున్న అన్ని వస్తువులకు చట్టరిత్యా న్యాయం అనిపించే విధంగా దస్తావేజీలను రెడీ చేసి పెట్టుకున్నారు. ఎక్కువ లాభం వచ్చే వస్తువుల విషయంలో చట్టాలను అతిక్రమించి వాళ్లతో తీసుకెళ్లే ఒప్పందం చేసుకున్నారు. అందులో దొనకొండ గ్రామానికి చెందిన పత్తి విత్తనం ఒకటి. దానికి సంబంధించిన దస్తావేజీలను తీసుకొని ఒక బ్రిటిష్ అధికారి ఆఫీస్ లో అడుగు పెట్టడంతో వాయిస్ ఓవర్ అయిపోతుంది.
ఈ సీన్ కంట్యూనేషన్ లో ఆ అధికారి మరో అధికారికి దొనకొండ గ్రామానికి చెందిన పత్తి మిల్ డాక్యూమెంట్స్ ఇస్తూ.. ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చిన తరువాత కూడా మరో 30 సంవత్సారాలు ఆ మిల్లుపై వచ్చే లాభాల్లో షేర్ వచ్చేలా రెడీ చేసిన ఫయిల్ అది. దానికి ఇలా చేస్తే సమస్యలు రావచ్చు అని ఆఫీసర్ అంటాడు. దానికి ఫయిల్ తీసుకొచ్చిన అధికారి ఒక థీయరీని ఎక్స్ ప్లేయిన్ చేస్తారు. దొనకొండ గ్రామంలో పటిసా పత్తి పండుతుంది. ఇది ప్రపంచంలోనే విలువైన విత్తనం. ఆ గ్రామ ప్రజలు గత రెండు వందల సంవత్సరాలుగా పత్తి నూలును తయారు చేయడం వలన వారి కన్నా ఇంకా ఎవరు బాగా చేయలేరని చెప్తారు. జన్రల్ రాబర్ట్ ఆ గ్రామానికి వెళ్లిన తరువాత గ్రామ ప్రజలతో రెండింతలు ఎక్కువ పని చేయించి గడిచిన పది సంవత్సరాల్లో చాలా లాభం పొందారిని, మరో ముప్పై ఏళ్లు వారిని షేర్ అడిగితే చాలా లాభం పొందొచ్చని చెప్తాడు. అలా దొనకొండ గ్రామాన్ని ఆ గ్రామంలో జమీందార్ ను తదితరులను పరిచయం చేస్తారు.
దీనికి సంబంధించిన కుట్రను ఆంగ్లేయులు పన్నుతారు. మరో నాలుగు రోజుల్లో దేశానికి స్వతంత్య్రం ఇవ్వాలని, ఈ లోపు జన్రల్ రాబర్ట్ తో మాట్లాడి విషయం తేల్చాలని ఆఫీసర్స్ మాట్లాడుకుంటారు. అలా దొన కొండ గ్రామాన్ని పరిచయం చేస్తారు.
కట్ చేస్తే పులికుంట పోలీస్ స్టేషన్ లో మరో ఆంగ్ల అధికారి మీద సీన్ ఓపెన్ అవుతుంది. దొన కొండ ప్రజలకు స్వతంత్య్రం రాబోతుందన్న విషయమే తెలియదని, అక్కడ పరిపాలిస్తున్న రాబర్ట్ దొరకు ఫోన్ ట్రై చేస్తే దొరకలేదని ఆ బ్రిటీష్ అధికారికి ఒక పోలీసులు చెప్తాడు. దొనకొండ గ్రామం కొండల నడుమ ఉంటుందని, ఆ పల్లే చుట్టంతా దట్టమైన అడవి, పులుల ఉంటాయని, సంవత్సరానికి రెండు సార్లు ఆ నూలుకోసం మాత్రమే ఆ గ్రామానికి వెళ్తాము అని చెప్తాడు. అలాగే రెండు నెలలకు ఒక సారి ఒక కొట్టోడు ఆ ఊరి నుంచి ఈ ఊరికి వస్తాడు అని దొరకు కావల్సిన అన్ని వస్తువులు ఆ కొట్టోడే తీసుకెళ్తాడు అని చెప్తాడు. బయట ప్రపంచంతో ఏ అనుసంధానం లేకుంటా ఒంటరిగా ఉంటుందని చెప్తాడు. ఎలాగైన ఒక లెటర్ ని రాబర్ట్ కు చేరవేయాలని ఆ అధికారి చెప్పడంతో ఇద్దరు పోలీసులు గుర్రాలపై ఆ గ్రామానికి బయలుదేరుతారు. అలా పోలీసులు వెళ్తూ.. రాబర్డ్ క్రూరత్వం గురించి మాట్లాడుకుంటారు. జలియాన్ వాలాబాగ్ సంఘటనలో కనీసం రెండు వేల మందిని చంపాలని డయ్యర్ కే చెప్పిన క్రూరుడు ఈ రాబర్ట్ అని దానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తారు. అంతటి మారణహోమానికి కారణం అయినా రాబర్ట్ ను దొనకొండకు తీసుకొచ్చారని మాట్లాడుకుంటారు. అలా ఆ గ్రామానికి వచ్చిన రాబర్ట్ అప్పటికే 10 గంటల పాటు పనిచేేసే రైతులను నూలు కోసం 16 గంటల పాటు పనిచేయించాడు అని వాడి ఆకృత్యాలను చెప్తారు. ఎదురుతిరిగిన వారికి వాడు వేసే శిక్షల చాలా భయనాకంగా ఉంటాయి. దీనికి తోడు రాబర్ట్ కొడుకు జస్టిన్ ఒకడు. రాబర్ట్ కు జస్టిన్ అంటే చాలా ఇష్టం జస్టిన్ కు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. దానికోసం వాడికి సొంత బంగ్లా ఉంటుంది. జస్టిన్ మీద గోరుకాటు పడినందుకే ఒకడి చేయి నరుకుతాడు రాబర్ట్.
అలా మాట్లాడుకుంటు పోలీసులు చెక్ పోస్ట్ వద్దకు వెళ్తారు. మొత్తం తెల్లవాళ్లందరు కలిసి దేశాన్నికి చేసిని హింస, రాబర్ట్ ఒక్కడ చేసిన హింస ఒక్కటే అని చెప్తారు. ఇక ఆ ఊరికి ఈ వార్త చెప్పాలని పోలీసులు బయలుదేరడంతో సినిమా టైటిల్స్ పడుతాయి.
ఆగస్టు 12 వ రోజు. కొండల నడుమ ఉన్న విలేజ్ ఏరియల్ షాట్ లో సీన్ ఓపెన్ అవుతుంది. రైతులు అంతా పత్తి తెంపుకొని వచ్చి, మిల్లులో చాలా హడావిడిగా పనిచేస్తుంటారు. దాహం అవుతుందని ఒక రైతు మరొక రైతుతో మాట్లాడుతుండడం చూసిన బ్రిటిష్ అధికారి కొరడతో కొడుతాడు. ఆ మంటతో ఆ రైతు విపరీతంగా అరుస్తాడు. అలాగే మరో రైతు వేడి నీళ్ల కుండను మోస్తు భుజం కాల్చుకుంటాడు. ఏడుస్తూ రెస్ట్ కావాలని అర్థిస్తే..దానికి రాబర్డ్ కొరడాతో చితకబాధుతాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక రైతు పని చేయడానికి పరుగెడుతాడు. పెయిన్ తెలియకుండా ఉండడానికి రెస్ట్ అవసరం లేదు. దానికి మించిన పెయిన్ ఇవ్వాలని చెప్పి 5 నిమిషాలు సమయం వృథా అయిందని అంటారు. అలా పని ముగిసాగా రాత్రికి అందరు రైతులు వారి గుడెసెలకు బయలు దేరుతారు.
తరువాత సీన్ లో రైతులు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఒక పేపర్ గురించి మాట్లాడుకుంటారు. అందులో ఈ సంవత్సరం స్వతంత్య్రం వస్తుందని తెలుసుకొని సంబరాలు చేసుకుంటారు. ఇక గాంధీ గురించి మాట్లాడుకునే మాటాలు చాలా సరదాగా ఉంటాయి. దానితో పాటు వారెంత అమాయకులో ఈ సీన్ చూస్తే అర్థం అవుతుంది.
మరో వైపు రాబర్డ్, జస్టిన్ ఇద్దరి పత్తి బొమ్మలను తయారు చేసుకొని బూతులు తిడుతూ తన వీరత్వాన్ని చూపిస్తుంటాడు ఒక రైతు. అది ప్రతి రోజు జరిగే తంతులా అతన్ని ఒక బామ్మ చిపురుతో కొడుతూ.. దమ్ముంటే వాన్ని కొట్టు అని అంటుంది. అందరూ స్వతంత్య్రం రావాలని కోరుకుంటారు.
మరో వైపు ఒక రైతు తన సొంత కూతుర్ని గోతిలో పాతి పెట్టి చంపాలనుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి వయసుకు వచ్చిందని అది జస్టిన్ చూస్తే తనను పాడు చేస్తాడని భయపడుతారు. అలా ఎం జరగదని, త్వరలో స్వతంత్య్రం వస్తుందని ఆ లోపు అంకయ్య సామి చూసుకుంటారని ఆ అమ్మాయికి స్నానం చేయిస్తూ అందరూ పాటలు పాడుకుంటారు. అక్కడికి హీరో పరమాన్ ఎంట్రీ ఇస్తాడు. అమ్మోరు కురుపు అని నాటకం ఆడి ఊర్లో ఉన్న ఆడపిల్లలను ఎలా కాపాడుకుంటున్నారో తనకు తెలుసని బెధిరిస్తాడు. దానికి వాళ్లంత అతన్ని తిడుతారు. తనకు కూడా ఇలాంటి కార్యం చేయమని అలా అయితేనే ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పడంతో హీరోకు గంధం పెట్టి అందరు పాటలు పాడుతారు.
అదే రోజు రాత్రి జమీందార్ కూతురికి పిండం పెడుతుంటారు. అదే సమయంలో జస్టిన్ వేటకు బయలు దేరుతాడు. అక్కడ జరుగుతున్న తంతు చూసి అక్కడి వస్తాడు. అక్కడ జమీందారు కులదైవం శిల బాగుందని ఆ అమ్మావారి విగ్రహన్ని కూడా దారుణంగా వర్ణిస్తారు. దాన్ని తన బెడ్ రూమ్ లో పెట్టమని వెళ్లిపోతాడు.
మరో సీన్లో హీరో తన స్నేహితుడు ఇద్దరు కలిసి ఒక చోట పెట్టిన అన్నం తీసుకొని తింటారు. అదే సమయంలో హీరో గ్రామస్తుల నుంచి సేకరించిన తేనే, పండ్లు, కూరలు అన్ని మూట కట్టుకొని హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. ఇక తాను ఎవరో కాదు జమీందారి కూతురు. జస్టిన్ నుంచి కాపాడానికి ఆమెకు ప్రతి సంవత్సరం దినం పెడుతూ ఊరిని, బ్రిటిష్ వాళ్లను నమ్మిస్తుంటారు. కాని హీరోయిన్ కు ఊరు తిరుగాలని ఉంటుంది. దానికి హీరో అలా కుదరదు అని వారిస్తాడు.
కట్ చేస్తే హీరో తాను నిర్మించకున్న మంచేపైన పడుకుని కలలు కంటుంటాడు. తన స్నేహితుడితో తన ప్రేమ గురించి చెప్తే.. ముందు నీ మనుసులో మాట తనతో చెప్పమని చెప్పి వెళ్లిపోతూ ఒక ముసలి జంట తమ ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో చెబుతూ ఉంటాడు.
ఆగస్టు 13. తెల్లవారుతుంది. మళ్లీ రైతులు నూలు మిల్లులో కష్టపడుతుంటారు. అక్కడికి జస్టిన్ గుర్రంపై వస్తాడు. అక్కడ అమ్మాయిలను చూసి అసహించుకొని వెళ్లిపోతాడు. అంతలో ఒక లేడికి వాష్ రూమ్ కోసం తన భర్తను అడుగుతుంటే బ్రిటిష్ అధికారి కొరడాతో కొడుతాడు. అలాగే వరుసగా పని చేస్తున్న అందరికి కొడుతూ అదే వరుసలో మగ వేశంలో ఉన్న అమ్మాయిని కూడా కొడుతాడు. దాంతో ప్రాణం పోయేలా ఏడుస్తుంది. అది చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. మగవేశంలో ఉన్న అమ్మాయిని కొట్టడంతో వీపు భాగం కనిపించడంతో జస్టిన్ కు అనుమానం మచ్చి. ఆ అమ్మాయిని తడుముతాడు. దాంతో తను అమ్మాయి అని తేలడంతో తన తల్లిదండ్రులు జస్టిన్ ను బతిలాడుతుంటే రాబర్డ్ ఇద్దర్ని కాల్చి చంపేస్తాడు. వాళ్ల తమ్ముడు అడ్డు రావడంతో ఆ అమ్మాయి తన ప్రాణాలను కాపడానికి జస్టిన్ తో వెళ్లిపోతాను అంటుంది. ఆ అమ్మాయిని తీసుకొని జమీందారు కొడుకు జస్టిన్ ప్యాలెస్ కు తీసుకెళ్తాడు. అక్కడ హీరో ఈ సీన్ ను చూసి బాధ పడుతుంటాడు. జస్టిన్ అమ్మాయిని లొంగదీసుకునే సీన్ ను పులి దాడి చేసిన సౌండ్ తో ఆర్ఆర్ వేస్తూ… స్వతంత్య్రం వచ్చిందని తెలపడానికి వచ్చిన ఇద్దరు పోలీసులు పులి దాడిలో మరణించినట్లు చూపిస్తారు.
తరువాత సీన్లో ఆ అమ్మాయికి ఒక ముసలావిడా స్నానం చేయిస్తుంది. గ్రామస్తులు ఉదయం మరణించిన ఆమె తల్లిదండ్రులను పాతిపెడుతారు. అక్కడే వారు సమావేశం అయి రాబర్ట్ గురించి రకరకాల మాట్లాడుతారు. జమిన్ గురించి ఊరివాళ్లతో గొడవపడుతాడు. అదే సమయంలో హీరో తల్లిగురించి తప్పుడుగా మాట్లడంతో.. గతం తలుచుకుంటాడు.
ఒక లేడీ తన కొడుకును తీసుకొని ఊర్లోకి పరుగెడుతుంది. ఒక గుడిసెల దాచుకుంటుంది. ఓ బ్రిటష్ అధికారి తన గురించి చెప్పమని అందరిని అడిగితే ఒక మహిళ తన గదిని చూపించడంతో తన కొడుకుతో ఒక గేమ్ ఆడుతుంది. తాను కొడుకు కళ్లు మస్తుంది. కొడుకు వాల్ల అమ్మ ముక్కు, నోరు మస్తాడు. అలా తను చనిపోతుంది. తన కొడుకే హీరో పరమాన్. ఆకలికి తట్టుకోలేడు. ఆకలితో ఏడిచి ఏడిచి కళ్లు తిరిగి పడిపోతే కొంత మంది పిల్లలు తన చుట్టు చేరుతారు. తన ఆకలి తెలుసుకొని ఆ పాప శ్రీవల్లి తనకు ఆహారం పెడుతుంది. తనలో వాళ్ల అమ్మను చూసుకుంటాడు పరమాన్. ఆ అమ్మాయి జమీన్ కూతురు. ఒక రోజు ఇద్దరు కలిసి ఇంట్లో అన్నం తింటుంటే జమీన్ వచ్చి కొడుతాడు. విధుల్లో తిరిగే కుక్కవి ఇలా ఇంటికి వచ్చి అన్నం తింటావా అని కొట్టిపంపించేస్తాడు. తాను ఏడుసుకుంటూ ఉండగా.. తనకు ఒక సీన్ కనిపిస్తుంది. దాంతో తనను పెల్లి చేసుకుంటే ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉండొచ్చని ఒక నిర్ణాయానికి వస్తాడు. అదే విషయం ఒక ముసలాయనతో చెప్పడంతో ఒక రాయిని చూయించి దాని అంత ఎదిగిన తరువాతే పెళ్లి గురించి ఆలోచించుకోవాలి అని చెప్తాడు. దాంతో పరమ ఆ రాయిని కొలత చూసుకుంటాడు.
అదే సమయంలో జమీన్ కుతూరు చనిపోయిందని తెలిసి విపరీతంగా ఏడుస్తాడు పరమాన్. అది గమనించిన శ్రీవల్లి తల్లి తాను బతికే ఉందన్న విషయం చెప్తుంది. ఇక ఎప్పటికైన తననే పెళ్లి చేసుకుంటానని మళ్లి కలలు కంటుంటాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా వాళ్లు ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటారు. ఊర్లో గ్రామస్తుల నుంచి తీసుకొచ్చిన పుట్ట తేనే తీసుకొచ్చి శ్రీ లక్ష్మకోసం తీసుకోస్తాడు. అలా ఒక రోజు పరమాన్ తన చెస్ట్ పై శ్రీవల్లి పచ్చబొట్టు వేసుకుంటాడు.
కట్ చేస్తే పసుపతి ఒక వ్యక్తి బ్రిటిష్ అధికారితో మాట్లాడుతంటాడు. స్వతంత్య్రం వచ్చిన తరువాత దొనకొండ ప్రజలు అంతసేపు పని చేయ్యడం కుదరదని అంటుంటాడు. దానికి సంబంధంచిన స్టే ఆర్డర్ ను చూపిస్తుంటాడు. ఇంకా రాబర్డ్ రాకపోవడంతో ఒక పోలీసు దొనకొండకు తన బృంధంతో బయలుదేరాలి అనుకుంటాడు. అదే సమయంలో దొనికొండ గ్రామంలో రాబర్ట్ ఇంట్లో ఫోన్ సమస్య ఉండడంతో ఒక వ్యక్తిని టౌన్ కు పంపిస్తారు. అలా వేళ్తున్న అతను కొన్ని నగలు తీసుకొని వెళ్తాడు ఆరా తీస్తే అవి జమీన్ కూతురు పెళ్లి కోసం అని అసలు నిజం చెప్తాడు. పులిగుంత జమీన్ కొడక్కు శ్రీవల్లిని ఇచ్చి పెళ్లిచేస్తాడని, ఇదే సరైన సమయం అని హీరోయిన్ కు తన విషయం చెప్పాలి అనుకుంటాడు.
కట్ చేస్తే శ్రీలక్ష్మీ తనకు పెళ్లి ఇష్టమే అని ఇలాగైనా బయటపడొచ్చని సంతోషంగా చెబుతుంది. ఆ మాటలతో పరమాన్ గుండె బద్దలు అవుతుంది. తరువాత సీన్లో జమీన్ ఇంట్లో భార్య, కూతురుతో ముచ్చట పెడుతుండగా ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. దాంతో అందరూ పడుతుండగా.. జమీన్ కొడుకు డోర్ తీస్తాడు.. వచ్చింది జస్టిన్ దొర. దాంతో అందరూ కంగారు పడుతారు. ఇంట్లోకి వచ్చిన జస్టిన్ తన స్టాచ్యూ కోసం వెతుకుతాడు. అలా ఇళ్లంతా వెతుకుతూ ఉండగా.. తనే తీసినట్లు విగ్రహాన్ని ఇస్తాడు జమీన్ కొడుకు. అయినా సరే తనకు ఒక పెట్టే మీద కన్ను పడడంతో వెళ్లితీయగానే శ్రీవల్లి దొరుకుతుంది. తరువాతి సీన్లో అదే పెట్టేలో దాక్కొని ఉన్న జమిన్ కూతురని జస్టిన్ కోసం పంపించండి అని రాబర్ట్ అరుస్తాడు. దానికి ఒక రోజు టైమ్ తీసుకొని జమిన్ ఇంటికి వస్తాడు.
నెక్ట్స్ సీన్ లో జస్టిన్, రాబర్డ్ మాట్లాడుకుంటారు. జమిన్ ఏ ప్రాబ్లమ్ చేయడా అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అదే సమయంలో జమిన్ తన కూతుర్ని చంపాలను కుంటాడు. ఇదే సరైన నిర్ణయం అని బలి ఇవ్వాలి అనుకుంటారు. వాళ్ల ఆచారం ప్రకారం భూమిధానం చెయ్యాలి అనుకుంటారు.
అదే రోజు రాత్రి ఆ ఊరి నుంచి బయటకు వచ్చిన గ్రామస్తుడికి అందరూ సంబరాలు చేసుకోవడం, బ్రిటిష్ సైనికులు వెళ్లిపోవడం చూసి అతను ఒకరిని అడుగుతాడు. మరో నాలుగు గంటల్లో స్వాతంత్య్రం రాబోతుందని తెలుసుకొని వెర్రిగా గంతులు వేస్తాడు. పిచ్చిపట్టినట్లు సంతోషంతో సంబరాలు చేసుకుంటారు.
మరోపక్క దొనకొండలో శ్రీవల్లిని భూదానం చేయడానికి జమీన్ తన కొడుకులు ఇద్దరు ఒక గోతి తవ్వి అందులో తన కూతర్ను పెట్టి కప్పేస్తారు. ఈ విషయం ముందే తెలసుకున్న పరమాన్ గోడ వెనుకాల నుంచి ఒక గోతిని తవ్వి శ్రీలక్ష్మిని బయటకు తీసుకోస్తాడు. ఈ పాటికి ప్రాణం పోయి ఉంటుంది అని గోతి తవ్వి చేస్తే తాను వేరే దారి గుండా తప్పించుకున్నదని షాక్ అవుతారు.
తరువాతి సీన్ లో జస్టిన్ ఇంట్లో శ్రీలక్ష్మీని దాచిపెడుతాడు పరమాన్. తాను వచ్చే వరకు ఒక బీరువాలో పెట్టి బయటకు వెళ్లిపోతాడు. అదే విషయాన్ని తన ఫ్రెండ్ కు చెప్పి తనను సేవ్ చేస్తానని చెప్పడంతో.. జస్టిన్ కు పులిపంజా తగిలిందని వేట నుంచి వెనక్కి వచ్చి తన ప్యాలేస్ అందరూ సమావేశం పెట్టుకుంటారు.భారతదేశానికి స్వతంత్య్రం వస్తుందనే వార్త తీసుకొచ్చిన పోలీసులతో రాబర్ట్ అరుస్తాడు. ఇదే విషయాన్ని జమీన్ కు చెప్పడానికి పోలీసువెళ్తుంటే వారిస్తాడు. అదే సమయంలో జస్టిన్ ఇంట్లో హీరోయిన్ ఉంటుంది.
పోలీసుతో రాబర్డ్ స్వతంత్య్రం వచ్చే విషయం గురించి వాళ్లకు చెప్పకూడదు అంటాడు. అదే విషయం విన్న హీరో స్నేహితుడు తన చేతులో టీని, గ్లాసులను కింద ఎత్తేస్తాడు.
జస్టిన్ కు తన ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న శ్రీవల్లి పట్టుబడుతుంది. రాబర్ట్ హీరో ఫ్రెండ్ నాలుక కోసేస్తాడు. శ్రీలక్ష్మి జస్టిన్ పై తిరగబడుతుంది. జస్టిన్ తన మెడపై కాలు పెట్టి చంపాలని చూస్తుంటే.. హీరో జస్టిన్ కాలు నరికేస్తాడు. ఒక వైపు రాబర్డ్ జస్టిన్ బంగ్లాకు వస్తుంటాడు. అందే సమయంలో భారతదేశానికి స్వతంత్య్రం వస్తుంది. దొనకొండలో విప్లవం మొదలౌతుంది. హీరో జస్టిన్ ను చంపెస్తాడు.
ఆగస్టు 15 న అందరు సంబరాలు చేసుకుంటారు. అదే సమయంలో రాబర్డ్ మీటింగ్ కు బయలు దేరుతారు. జస్టిన్ బంగ్లాకు వచ్చిన రాబర్డ్ కు జస్టిన్ వేటకు పోయినట్లు హీరో చెప్తాడు. ఆకరిసారి తన బానిసలను చూస్తానని ఊర్లోకి వెళ్లి అందరికి చూసి రాబర్ట్ మీటింగ్ కు వెళ్తాడు. ఇదే విషయాన్ని జమీన్ తన కొడుకులతో మాట్లాడుతాడు. తరువాత సీన్లో జస్టిన్ బాడీని పరమాన్ దాచిపెట్టి శ్రీవల్లిని తీసుకొని బయలుదేరుతాడు. అలా రాత్రి అడవిలో ఇద్దరు బయలు దేరుతారు. ఆ సమయంలో తన మనుసలో ఉన్న మాట హీరోతో చెప్తుంది. తనను పెళ్లి చేసుకుంటాన్ని చెప్తుంది. హీరోకు ఇష్టం లేదని గట్టిగా చెప్పడంతో శ్రీవల్లి గ్రామంలోకి వెళ్తుంది. అదే సమయంలో పరమాన్ ఫ్రెండ్ రక్తంతో అరుస్తూ వస్తాడు. అతను అలా అరుస్తుండంతో గ్రామస్తులు అక్కడికి వస్తారు. స్వతంత్య్రం వచ్చిందని అతను చెప్పే ప్రయత్నం గుండె పిండేసేలా ఉంటుంది. రక్తం పోవడంతో సృహతప్పిపడిపోతాడు. అతన్ని అక్కడ నుంచి తీసుకెళ్లిన తరువాత అందరు శ్రీవల్లిని చూస్తారు. దాంతో పరమాన్ కాపాడుతా అంటాడు. దానికి గ్రామస్తులు శ్రీవల్లిని తీసుకెళ్తారు. ఆ విషయం జమీన్ కొడుకు చూసి పరమాన్ మీద కోపంతో రగిలిపోతారు. శ్రీవల్లిన కాపాడి పరమాన్ ను చంపాలి అనుకుంటారు. అదే రాత్రి ఊరి బయటికి వెళ్లిన కొట్టువాడు స్వతంత్య్రం వచ్చిన సంతోషంతో అరుస్తూ ఊర్లోకి వస్తూ ఉండగా అది రాబర్డ్ చూస్తాడు.
తరువాత సీన్లో జమీన్ చేస్తున్న ఆరాచాకాల గురించి శ్రీవల్లి తెలుసుకుంటుంది. తరువాత పరమాన్ శ్రీవల్లిని ప్రేమిస్తున్న విషయం తెలుసుకుంటుంది. తనను పరమాన్ ఎంత ప్రేమించాడో అర్థం అవుతుంది. తాను చేసిన త్యాగం గురించి తెలుసుకుంటుంది. విషయం తెలుసుకున్న శ్రీవల్లి హీరోను వెతుకుంటూ మంచె వద్దకు వెళ్లి పరమాన్ ను కౌగిలించుకుంటుంది. రాబర్ట్ ఊరి విడిసి పోవడంతో గ్రామస్తులు అంతా సంబరాలు చేసుకుంటారు. అలా ఇద్దరు కౌగిలించుకోవడం జమీన్ కొడుకు చూస్తాడు. అంతలో ముసలావిడ వచ్చి శ్రీవల్లిని తీసుకొని వెళ్తుంది. అసలు నిజం ఏంటని నిలదీస్తుంది. దీంతో శ్రీవల్లి నిజం చెబుతుంది. మనసుపడిన అమ్మాయికోసం తెల్లోడిని నరికిన మొనగాడు పరమాన్ అని ముసలావిడ పొగుడుతుంది. అదే సమయంలో ఈ విషయం తెలిస్తే రాబర్ట్ ఏం చేస్తాడో అని భయపడుతుంది.
నెక్ట్స్ సీన్లో రాబర్ట్ మీటింగ్ లో పాల్గొంటాడు. ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో జస్టిన్ మిస్ అయిన వార్త తెలుస్తుంది. గుర్రం తోకకు గుడ్డ కట్టి మంటపెట్టాడని తెలయడంతో జస్టిన్ ఏదో అపాదలో ఉన్నాడని, దీనంతటకి కారణం జమీందార్ అని ఆలోచించి గన్స్ అండ్ టీమ్ తో రెడిగా ఉండమని చెప్తాడు. అదే సమయంలో వారికి ఏ రైట్స్ లేవని పసుపతి చెప్తాడు. అయితే దొనకొండ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిన విషయం తెలియదను ఏదో ప్లాన్ చేస్తాడు.
దొనకొండ గ్రామంలో ప్రజలకు ఫ్రీడమ్ వచ్చిన విషయాన్ని చెప్పాలని హీరో ఫ్రెండ్ ఏంత ప్రయత్నించినా అది విఫలయత్నం అవుతాయి. రాబర్ట్ దొర బొమ్మను చూపించి చెప్పే ప్రతి విషయం చాలా ఫన్నిగా ఉంటుంది. ఇంట్లో వంటరిగా కూర్చున్న శ్రీవల్లితో వెళ్లిపోదామ్ అని అంటాడు హీరో. అయితే ఊరి వాళ్లమీద పరమాన్ కు మంచి అభిప్రాయం లేదు. తాను అలా అపార్థం చేసుకున్నాడని
శ్రీవల్లి నిజం చెప్తుంది. తన తల్లిని దేవతల భావించి నిత్యం ప్రేయర్ చేస్తున్న విషయం చెప్తుంది. జస్టిన్ శవాన్ని వేరే చోట దాచిపెట్టి వస్తా అని వెళ్లిపోతాడు.
తరువాత రాబర్ట్ తో పాటు ఇండియన్ ఆఫిసర్ పసుపతి కూడా వాళ్లతో వస్తాడు.
నెక్ట్స్ సీన్ లో పరమాన్ రాబర్ట్ శవాన్ని దాచిపెట్టడం కట్టెలకు వచ్చిన ఒక గ్రామస్తుడు చూసి అందరికి చెప్తాడు. రాబర్ట్ దొర అందరిని చంపేస్తాడని భయపడుతారు. గ్రాామస్తులంతా చెట్టుకొకడు పుట్టకొకడు పరుగెడుతారు. నెక్ట్స్ సీన్లో ఒక ఫోన్ సంభోషణలో స్వాతంత్య్రం వచ్చిన విషయం చెప్పే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. జమీన్ తో ఫోన్ లో జస్టిన్ గురించి అడుగుతాడు రాబర్ట్. జమీన్ భయపడిపోతాడు. తన కూతురు చనిపోయింది అని మళ్లి అబద్దం చెప్తాడు. జస్టన్ కు ఏం అయినా గ్రామాన్ని నాశనం చేస్తా అని బెదిరిస్తాడు రాబర్ట్. అదే సమయంలో కొట్టువాడు రాబర్ట్ మీద అరవడంతో రాబర్ట్ కోపంతో చంపేస్తాడు.
గ్రామస్తులు అందరితో జమీన్ మాట్లాడుతాడు. అందరు కలసి పరమాను కొట్టి చంపేద్దామని ప్లాన్ చెప్తాడు. మీకు సాయం చేస్తాను, తన కూతురుని తన వద్దకు చేర్చాలని ఒప్పందం కుదుర్చుకుంటాడు. గ్రామస్తులు అందరు కలసి పరమాను చంపాలను కుంటారు. అదేసమయంలో శ్రీవల్లిని కూడా చంపమని కోడుకులతో జమీందార్ చెప్తాడు.
శ్రీవల్లికోసం గ్రామస్తులతో పరమా ఫైట్ చేస్తాడు . తనను తీసుకొని పారిపోదాం అని పరుగెడుతాడు. ఒక వైపు రాబర్ట్ ఊర్లోకి వస్తుంటాడు. మరో వైపు గ్రామస్తులంతా పరమా, శ్రీవల్లిని వెంబడిస్తూ అడవంతా తిరుగుతారు. వాల్లతో ఫైట్ చేస్తూ వాళ్లను దారి మళ్లిస్తాడు. రాబర్ట్ అడవిలో వెతుకుతుంటారు. జమీన్ కొడుకులు అడ్డం పడుతారు. వాళ్లను తప్పించుకొని వెళుతుంటే గ్రామంలో పాప అడ్డుపడుతుంది. వారు ఆగిపోతారు. గ్రామస్తులు పరమను కొడుతుంటారు.
ఆగస్టు 16. గ్రామస్తులకు పరమాన్ కు గొడవ జరుగుతుంది. జస్టిన్ చంపడంపై అందరూ మాట్లాడుకుంటారు. జస్టిన్ కు ఎదిరించి నిలబడలేని వారు చావండి అని వాళ్లకు మోటివేషన్ చేస్తాడు హీరో. ఇలా బయపడుతూ చాచ్చేవాళ్లకు స్వతంత్య్రం వచ్చిన ఏం చేస్తారు అని గ్రామస్తులతో ఎమోషనల్ గా మాట్లాడుతాడు. గ్రామస్తులు అంతా ఒకే చోట ఉండి మాట్లాడుకుంటారు.. వారిలో మార్పు మొదలౌతుంది. జస్టిన్ చంపిన వీరుడు అని గ్రామస్తులు ఒకటౌతారు. జమీన్ కు తన భార్య తిరగబడుతుంది. శ్రీవల్లి తనను చంపమని తన తండ్రితో మాట్లాడుతుంది. అందరూ అలా సముహాంగా ఉండగా రాబర్ట్ దొర వచ్చేస్తున్నాడు అన్న వార్త తెలుస్తుంది. శ్రీవల్లి, పరమాన్ ఇద్దరిని గ్రామస్తులు వెళ్లిపొమ్మాంటారు.
అడవిలో తిరుగుతున్న రాబర్ట్ కు తన కొడుకు శవం కినిపిస్తుంది. కోపంతో రగిలిపోయి గట్టిగా అరుస్తాడు. పసుపతి జరిగిన దానికి న్యాయం జరుగుతుంది అంటే దానికి రాబర్ట్ ఒప్పుకొడు. పసుపతితో సహా ఇండియన్ సైనుకులను అందరిని కాల్చేస్తాడు. జస్టిన్ శవాన్ని గ్రామానికి తీసుకొచ్చి పంచాయితి పెడుతారు. 2 నిమిషాల్లో చెప్పకపోతే చంపేయమని ఆదేశాలు ఇస్తాడు. పోలీసులుకు చుట్టుముడుతారు. అంతలో పరమా, శ్రీవల్లి ఇద్దరు అక్కడికి వస్తారు. పరమాన్ బ్రిటిషర్స్ కొడుతారు. రాబర్ట్ వాళ్లను ఆపి దండనం వేయమంటాడు. ముందు శ్రీవల్లిని చంపమట్టాడు. అంతలో గ్రామస్తులు జస్టిన్ ను చంపింది నేనే అని అందరు తిరగపడుతారు. నేను అంటే నేను అని అందరూ తిరగబడుతారు. కోపంతో రాబర్ట్ ఒక ముసలి వాడిని చేయితో కొట్టి కొట్టి చంపేస్తాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అప్పటి వరకు మాట్లాడని తన భార్య తనతో మాట్లాడుతుంది.
అందరిని కొట్టి చంపాలను కుంటాడు. చేతులో ఒక ముళ్ల గదను పట్టుకొని ఒక్కోక్కరిని చంపుతా అంటాడు. దానికి ఎదురు తిరిగిన జమీన్ కాల్చి చంపేస్తాడు. ఒక చిన్న పిల్లను చూపించి తనను తీసుకురా అనే సరికి తన తల్లి తన బిడ్డ మెడమీద కత్తి పెడుతుంది. అలా అందరు తల్లి దండ్రులు తమ పిల్లలమీద కత్తి పెడుతారు. స్వతంత్య్రం కోసం బతికింది చాలని వారు కూడా అందరూ చనిపోవాలను కుంటారు. హీరో ఫ్రెండ్ ను రాబర్ట్ కొట్టడంతో పరమాన్ కట్లు విప్పుతాడు. రాబర్ట్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్తాడు. అంతలో గ్రామస్తులు అంతా బ్రిటిషర్స్ మెడలకు కత్తులు పెడుతారు. రాబర్ట్, పరమాన్ ఇద్దరి నడుమ భీకర ఫైటింగ్ జరుగుతుంది. ఇద్దరు ఫైట్ చేస్తుకుంటుంటే గ్రామస్తులు అరుస్తుంటారు. రాబర్ట్ ను పరమాన్ కసితీర కొడుతాడు. వేడినీళ్లలో వేయాలను కుంటాడు. మేడపై కత్తి పెట్టడంతో.. గ్రామస్తులు అందరూ బ్రిటిషర్ల మెడలపై కత్తులు పెడుతారు.
అంతలో మీకు స్వతంత్య్రం వచ్చింది. అనే విషయాన్ని రాబర్ట్ చెప్తాడు. దానికి వారు నమ్మరు. రాబర్ట్ అరిసిన అరుపుకు హీరో ఫ్రెండ్ తన రెండు చేతులను ఆకాశాన్ని చూపిస్తూ ఏడుస్తాడు. వాళ్లకు స్వతంత్య్రం వచ్చిన విషయం తెలిసి గ్రామస్తులు అందరూ ఏడుస్తారు. అందరికి స్వేచ్చ వచ్చిందని నవ్వుతారు. దండనం మీద తూనిగ వాలుతుంది. పక్షులు స్వేచ్చగా గాల్లో ఎగురుతాయి. అందరూ కలిసి రాబర్ట్ ని చంపేస్తారు. గ్రామస్తులు అంతా సంబరాలు చేసుకుంటారు. ఇండియన్ ఫ్లాగ్ సీన్ తో సినిమాకు శుభం కార్డు పడుతుంది.
ఇది పూర్తిగా ఆగస్టు 16 1947 చిత్రం స్టోరి. మా మూవీ ఎక్స్ ప్లనేషన్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైన మూవీ గురించి ఎక్స్ ప్లనేషన్ కావాలంటే మాకు తెలియజేయండి.