టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ మధ్యనే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించారు. నటన పరంగానూ డ్యాన్స్ పరంగానూ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) దుమ్మురేపాడు. ఆ మూవీలో ఫైట్స్ కూడా ఇరగదీశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ మధ్యనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించారు. నటన పరంగానూ డ్యాన్స్ పరంగానూ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) దుమ్మురేపాడు. ఆ మూవీలో ఫైట్స్ కూడా ఇరగదీశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చేస్తున్న తాజా సినిమా ‘మీటర్'(Meter). ఈ మూవీను చిరంజీవి, హేమలత రూపొందిస్తున్నారు. రమేశ్ ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. ‘బ్లాస్ట్ కావడానికి ఇది పవర్ తో నడిచే మీటర్ కాదు..పొగరుతో నడిచే మాస్ మీటర్’ అంటూ టీజర్ లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
మీటర్(Meter) సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ద్వారా అతుల్య రవి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. కొయంబత్తూర్ కి చెందిన అతుల్య రవి 2017 నుంచి తన కెరియర్ ను ప్రారంభించింది. మీటర్(Meter) సినిమాలో పోసాని కృష్ణ మురళీ, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 7వ తేదిన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్(Movie Unit) తెలిపింది.