మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి… ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం కేవలం సినిమాలపైనే పెట్టారు. అయితే.. మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీటే దానికి కారణంగా భావిస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం చిరంజీవి మళయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రిమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాలో ఒక డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆడియో ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త రాజకీయాల పరంగా తీవ్రదుమారం రేపుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ వాయిస్ ఓవర్ తో ఉన్నటువంటి ఒక డైలాగ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది చూసిన పలువురు నెటిజన్స్ మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి డైలాగ్ ట్వీట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి ఈయన తిరిగి రాజకీయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారా తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో బాగమేననీ సినిమా ప్రమోషన్ కోసం సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ ను ఇలా ఈయన ఉపయోగించారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.