»Mass Beat Song Release From The Movie Das Ka Dhamki
Das Ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ నుంచి మాస్ బీట్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్(Tollywood)లో యంగ్ టాలెంటెడ్ హీరో విష్వక్సేన్(Viswaksen)కు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన ఏ సినిమా చేసినా యూత్ ఎక్కువగా ఆదరిస్తారు. విష్వక్సేన్(Viswaksen) హీరోగానే కాకుండా దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన ఓ వైపు బయట బ్యానర్లో సినిమాలు చేసుకుంటూ మరో వైపు తన సొంత బ్యానర్లో కూడా సినిమా చేస్తున్నారు.

‘దాస్ కా ధమ్కీ’ నుంచి మాస్ బీట్ సాంగ్:
తాజాగా ఆయన సొంత డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘దాస్ కా ధమ్కీ'(Das Ka Dhamki). ”ఓరి దేవుడా” సినిమా తర్వాత విష్వక్సేన్(Viswaksen) చేస్తున్న మరో సినిమా ఇది. ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్(Lyrical Song)ను విడుదల చేశారు. ”ఓ డాలర్ పిలగా..జిల్ జిలగా..నీ జంగలు జింకనురా” అంటూ ఈ పాటను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
ఈ మూవీ(Movie)కి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం అందించారు. మంగ్లీ, దీపక్ బ్లూ ఈ పాటను ఆలపించారు. ఇదొక ఐటమ్ సాంగ్. మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే బీట్ తో ఈ సాంగ్(Song) సాగుతుంది. ఈ మూవీలో విష్వక్సేన్(Viswaksen) జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. అలాగే ఈ మూవీలో రావు రమేశ్, పృథ్వీ, అజయ్, రోహిణి, అక్షర గౌడ వంటివారు నటిస్తున్నారు.