తాను దక్షిణాదిన (south films) మంచి విజయాలు దక్కించుకున్నానని, అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) బాబా సినిమా (Baba Film) తర్వాత అక్కడ తన కెరీర్ ముగిసిపోయిందని (South India career finished) నిన్నటి తరం నటి మనీషా కోయిరాలా (Manisha Koirala) అన్నారు. ఆ సినిమా పైన తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ భారీ వైఫల్యంతో తన కెరీర్ ముగిసిపోయిందన్నారు. బొంబాయి చిత్రం (Bombay Cinema) ద్వారా దక్షిణాది సినీ ప్రియులకు చేరువయ్యారు ఆమె. పలు దక్షిణాది చిత్రాల్లో మెప్పించిన ఆమె బాబా తర్వాత తమిళ పరిశ్రమకు (Tamil Industry) దూరమైంది. ఆ తర్వాత క్రమంగా దక్షిణాది నుండి వెళ్లిపోయారు. ఈ సినిమా 2002లో విడుదలైంది.
అంతకుముందు 1995లో బొంబాయి, 1996లో ఇండియన్, 1999లో ముధల్వన్ సినిమాల్లో నటించారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘తమిళంలో తాను చేసిన చివరి సినిమా బాబా వైఫల్యాన్ని చవి చూసింది. ఆ సినిమా పైన తాము చాలా ఆశలు పెట్టుకున్నాము. తీరా చూస్తే సినీ ప్రియులు తిరస్కరించారు. దీంతో దక్షిణాదిన తన కెరీర్ ముగిసిపోయిందని భావించాను. చివరకు అదే జరిగింది. బాబా కంటే ముందు తాను నటించిన పలు సినిమాలు విజయవంతమయ్యాయి. ఆ సినిమాల ద్వారా తనకు పేరు వచ్చింది. బాబా తర్వాత మాత్రం నాకు ఆఫర్స్ రాలేదు. ఎలాంటి ప్రచారం లేకుండా ఇటీవల ఆ చిత్రీన్ని రీ-రిలీజ్ చేసినప్పుడు మంచి విజయాన్ని అందుకున్నది. అది చూసి నేను ఆశ్చర్యపోయా. ఈ సినిమా విడుదలైన 20 ఏళ్ల తర్వాత రెండోసారి హిట్ అయిందన్నారు. కానీ రజనీకాంత్ తో కలిసి పని చేయడం మాత్రం ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పారు.
తొలుత బొంబాయి సినిమాను తాను చేయకూడదని భావించానని, కెరీర్ ఆరంభంలో తల్లిపాత్రలు సరికాదని కొంతమంది హెచ్చరించారని, కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం తనను తిట్టారని గుర్తు చేసుకున్నారు. మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయో తెలుసా… ఆ సినిమాల్లో నటించే అవకాశం వదులుకోవద్దని చెప్పారన్నారు. దీంతో అంగీకరించినట్లు చెప్పారు.