నటి ప్రియాంక చోప్రా (Actress Priyanka Chopra) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పైన (Bollywood Industry) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ రాజకీయాలతో (Politics in Bollywood) తాను విసిగిపోయానని, అందుకే హాలీవుడ్ లో (Hollywood) స్థిరపడ్డట్లు చెప్పారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో (Hindi Cinema Industry) తనను ఓ మూలకు తోసేశారని, తనకు ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదన్నారు. కొందరితో విబేధాలు వచ్చాయని, చాలా రాజకీయాలు ఉంటాయని, వాటితో విసిగిపోయి, బాలీవుడ్ (Bollywood) నుండి బ్రేక్ తీసుకోవాలని భావించానని, అలా అమెరికాకు (America) వచ్చేశానని చెప్పారు. దేశీ హిట్స్ కు చెందిన అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను (Music Video) మెచ్చి, హాలీవుడ్ లో అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అంజులా ప్రస్తుతం ప్రియాంకకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను (Hollywood singer Nick Jonas) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ప్రియాంక చోప్రా తీరుపై ఆకాష్ అశోక్ అనే నెటిజన్ తీవ్రంగా స్పందించారు. తాను హాలీవుడ్ వెళ్లడనికి ఈ నటి బాలీవుడ్ పైన విమర్శలు గుప్పించిందని మండిపడ్డారు. హాలీవుడ్ లో సింపతి కోసం చూస్తున్నట్లుగా ఉందని, వెస్టర్న్ పట్ల ఆకర్షితురాలయినట్లుగా ఉందన్నారు. లేకుంటే ఆమె ఒక అంగ్రేజీని ఎందుకు పెళ్లి చేసుకుంటుందన్నారు. బాలీవుడ్ తనను పట్టించుకోలేదన్న ఆమె వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్నారు.
మరోవైపు, ప్రియాంక చోప్రా కామెంట్స్ పైన నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించారు. ఆమెకు మద్దతు పలికారు. కరణ్ జోహార్ ఆమెను ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. ప్రియాంక, కంగనా 2008లో ఫ్యాషన్ చిత్రంలో నటించారు. బాలీవుడ్ లో ఇబ్బందుల వల్లనే ప్రియాంక హాలీవుడ్ కు వెళ్లినట్లు చెప్పారు. ఆమెను గుమికూడి, తరిమి కొట్టారన్నారు. కరణ్ ఆమెను నిషేధించారని అందరికీ తెలుసునని చెప్పారు.