ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్ బాబు. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. దాంతో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు..
మహేష్ తన తల్లిదండ్రులను కోల్పోవడంతో బ్రేక్ పడింది. అలాగే స్క్రిప్టు విషయంలో మహేష్ డైలమాలో ఉన్నాడని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. దీంతో త్రివిక్రమ్ ఇప్పుడు మొత్తంగా స్క్రిప్ట్‌నే మార్చేసినట్టు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ ఓ భారీ బయోపిక్‌ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. జీఆర్. గోపీనాథ్ బయోపిక్‌గా వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది లేడీ డైరెక్టర్ సుధా కొంగర.
దాంతో ఇప్పుడు.. మరో బయోపిక్ రంగం సిద్దం చేస్తోందట.. ప్రముఖ పారిశ్రామికవేత్త, రతన్ టాటా బయోపిక్‌ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రతన్ టాటా జీవితం, ఆయన చేస్తున్న సేవ.. ఇవన్నీ యువతకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ బయోపిక్ రూపకల్పన చేస్తోందట సుధాకొంగర. అయితే ఈ బయోపిక్ కోసం ముందుగా మహేష్ బాబుని అనుకున్నారని సమాచారం. కానీ ఇప్పటికే మహేష్.. రాజమౌళితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు.
అందుకే రతన్ టాటా బయోపిక్కు నో చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. దాంతో ఈ క్రేజీ బయోపిక్‌లో సూర్య లేదా.. అభిషేక్ బచ్చన్ హీరోగా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. మహేష్ ఈ బయోపిక్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు అభిమానులు. కానీ ఒక్కసారి రాజమౌళితో కమిట్ అయ్యాక మరో సినిమా చేయడం కష్టం కాబట్టి.. మహేష్ ఈ ప్రాజెక్ట్‌ను వదులకున్నాడని చెప్పొచ్చు.