ప్రస్తుతం మహేష్ బాబు తీవ్ర విషాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోవడంతో.. మహేష్‌ను ఓదార్చడం కష్టంగా మారింది. అయినా కృష్ణ కోసం కడసారి చూపులకు వచ్చిన ఫ్యాన్స్‌కు భోజనాలు ఏర్పాటు చేశాడు మహేష్. అంతేకాదు తండ్రి మరిణించిన రోజే మరో గుండెకు ప్రాణం పోశాడు. దాంతో మా హీరో, మా మహేష్ బాబు గ్రేట్ అంటు మురిసిపోతున్నారు ఘట్టమనేని అభిమానులు.
గత కొంత కాలంగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు మహేష్. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ తన పని ఆపలేదు. ఆర్థికంగా స్తోమత లేని ఓ మూడేళ్ల బాబుకు.. అత్యవసర పరిస్థితుల్లో గుండెకు సర్జరీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
కృష్ణ కన్ను మూసిన రోజే ఈ సర్జరీ జరగినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అలాగే ధైర్యంగా ఉండాలని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తండ్రి జ్ఞాపకార్ధం సరికొత్త పనికి శ్రీకారం చుట్టాడు మహేష్. హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ మ్యూజియంలో 30 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నాడు. దాంతో పాటు కృష్ణ నటించిన 350 సినిమాల ఫోటోలు, షీల్డులు, సాధించిన రికార్డులు వంటి వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచనున్నారు. మొత్తంగా విషాదంలోను మహేష్ చేసిన సేవ మరువలేనిది అంటున్నారు.