పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ను మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కసితో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మొదలు పెట్టాడు పూరి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు గానీ.. లైగర్ ఫ్లాప్‌తో ఆదిలోనే ఆగిపోయింది జేజిఎం. ఓ విధంగా చెప్పాలంటే.. దీన్ని నుంచి మహేష్ తప్పించుకున్నట్టేనని చెప్పాలి. అయితే మహేష్ రిజెక్ట్ చేసిన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. లెజెండరీ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయింది. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు మణిరత్నం.
అయితే బాహుబలి ఇచ్చిన ఊపుతో.. ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను.. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో లేదనే టాక్ వినిపిస్తోంది. తమిళ్లో తప్పితే మిగతా భాషల్లో ఈ సినిమా ఆకట్టుకునే అంశాలు తక్కువగా ఉన్నాయి. క్యారెక్టర్ పేర్లతోనే కన్ఫ్యూజ్ చేసేశాడు మణిరత్నం. మొత్తంగా PS1కు ఆశించిన రిజల్ట్ కనబడటం లేదు. దాంతో ఈ సినిమా నుంచి మహేష్ తప్పించుకున్నాడనే చర్చ జరుగుతోంది. గతంలో ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు మణిరత్నం. కానీ ఎందుకో సున్నితంగా నో చెప్పేశాడు. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్‌ని కూడా తీసుకోవాలనుకున్నాడట. ఇళయ దళపతి కూడా రిజెక్ట్ చేసినట్టు టాక్. దాంతో ఫైనల్‌గా విక్రమ్, కార్తి, జయం రవితో తెరకెక్కించాడు. కమల్ హాసన్‌ను కూడా సంప్రదించినట్టు టాక్. అయితే పీఎస్ 1 ఫైనల్ రిపోర్ట్ ఏంటనేది ఇప్పుడే తేలకపోయినా.. మహేష్ ఈ సినిమా నుంచి తప్పించుకున్నాడనే చర్చ మాత్రం జరుగుతోంది.