ఇట్స్ అఫిషియల్.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఒక్కటయ్యారు. కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టేశాడు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా కొంతమంది అతిథుల సమక్షంలో జరిగింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులనే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ధరించారు. కియారా ఎక్కువగా రెడ్ను ప్రిఫర్ చేస్తుంది. కానీ.. తన పెళ్లిలో మాత్రం సిల్వర్ కలర్ డ్రెస్‌లో మెరిసింది.
సిద్ధార్థ్ కూడా ఇంచుమించు అదే రంగు డ్రెస్‌లో కనిపించాడు. సిద్ధార్థ్, కియారా పెళ్లి అవగానే ప్యాలెస్ బయట ఉన్న మీడియా మిత్రులకు, అభిమానులకు స్వీట్లను పంచారు. సిల్వర్ రంగులో ఉన్న షేర్వానీని సిద్ధార్థ్ ధరించగా, కియారా మాత్రం పింక్ లెహంగాను ధరించినట్టు తెలుస్తోంది. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక.. ఫిబ్రవరి 8న ప్రైవేటు విమానంలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి ఢిల్లీకి బయలుదేరనున్నారు. సిద్ధార్థ్ ఇంటికి వెళ్లి అక్కడ ఫిబ్రవరి 9న రిసెప్షన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 10న ముంబైకి కొత్త దంపతులు పయనమవనున్నారు. ఫిబ్రవరి 12న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్‌ను కియారా అద్వానీ కుటుంబం ఏర్పాటు చేసింది. ఈ రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు మీడియాకు కూడా ఆహ్వానం అందింది.