»Kamal Haasan Thug Life Is Copy From Hollywood Film
Thug Life ఆ సినిమాకు కాపీ..? నెటిజన్స్ ట్రోల్
కమల్ హాసన్- మణిరత్నం కొత్త మూవీ థగ్ లైఫ్ హాలీవుడ్ మూవీ కాపీ అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో సీన్లను థగ్ లైఫ్ సీన్లను పక్కనపెట్టి మరి విమర్శిస్తున్నారు.
Kamal Haasan Thug Life Is Copy From Hollywood Film
Kamal Haasan Thug Life: విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)- లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (mani ratnam) కాంబోలో వస్తోన్న మూవీ పేరును నిన్న రివీల్ చేశారు. ఆ సినిమాకు థగ్ లైఫ్ అనే టైటిల్ ఖరారు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసి ఫ్యాన్స్ (fans) ఖుషి అయ్యారు. కమల్-మణి కాంబో అదిరిందని.. సూపర్ మూవీ రాబోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంతలోనే.. ఆ టైటిల్ రివీల్ సీన్ హాలీవుడ్ మూవీకి కాపీలా ఉందని కనిపెట్టేశారు. ఇంకేముంది నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
రైజ్ ఆఫ్ స్కై వాకర్ అనే హాలీవుడ్ మూవీలో కొన్ని సీన్స్ తీసుకొని థగ్ లైఫ్ టైటిల్ రిలీల్లో కనిపించాయి. ఆ రెండు మూవీస్ స్టిల్స్ పక్క పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అగ్ర దర్శకుడు మణిరత్నం కూడా కాపీ కొడతారా..? మిగతా భాషల సీన్స్ తీసుకుంటారా..? లేదంటే ప్రేరణ పొందుతారా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
విక్రమ్ మూవీ హిట్‌తో కమల్ హాసన్ మంచి ఊపు మీద ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులు చేసి మణిరత్నం మంచి జోష్ మీద ఉన్నారు. తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తోంది. సీన్స్ కాపీ చేయడంతో ఒక్కసారిగా వచ్చిన హైప్ పోయింది. అంతకుముందు మూవీ, స్టోరీ, నటులు దుల్కర్ సల్మాన్, జయం రవి, త్రిష, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ ఇవ్వడంతో మంచి హైప్ వచ్చింది. కానీ ఫోటోలు లీక్ కావడంతో ఒక్కసారిగా తుస్సుమంది.
టైటిల్ రివీల్ వీడియోలో కమల్ హాసన్ డైలాగ్ చెబుతారు. అందులో తనపేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ అని అంటారు. అంటే 36 ఏళ్ల క్రితం వచ్చిన నాయకుడు మూవీకి ఇదీ సిక్వెల్ అనే అనుకున్నారు. నాయకుడు మూవీ మంచి హిట్ అయ్యింది. థగ్ లైఫ్ మూవీలో కమల్ హాసన్ దొంగ, క్రిమినల్‌గా కనిపిస్తారు. ఆ మూవీకి సంబంధించి ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి.. మరి దీనిపై యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.