ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది.. బ్లాక్ బస్టర్ కొట్టింది.. కోట్లు కొల్లగొట్టింది.. హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేసింది.. ఇంకా నెట్ ఫ్లిక్స్‌లో దూసుకుపోతునే ఉంది.. కానీ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఆరు నెలలు కావొస్తుంది.. కానీ కొరటాల శివతో చేయబోయే సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు. అప్పుడెప్పుడో అనౌన్స్ అయినా ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ నుంచి.. ఈ ఏడాది తారక్ బర్త్ డే కానుకగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. అది తప్పితే ఇప్పటి వరకు ఇటు ఎన్టీఆర్ నుంచి గానీ, కొరటాల టీమ్ నుంచి గానీ మరో అప్డేట్ లేదు. అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం కొరటాల ఇంకా స్క్రిప్టును చెక్కుతునే ఉన్నాడని ప్రచారంలో ఉంది. దాంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వెనక్కి వెళ్తునే ఉంది ఈ క్రేజీ ప్రాజెక్ట్.
మరో వైపు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్.. శంకర్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ.. కమర్షియల్‌గా ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నాడు చరణ్. కానీ యంగ్ టైగర్ మాత్రం ఎన్టీఆర్ 30ని సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. అప్టేట్ కోసం ఇంకెంత కాలం ఎదురు చూడాలి.. ఈ ఓపిక భరించలేకపోతున్నామని అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్ నుంచి ‘భీమ్ అన్ ట్రిమ్డ్ ఇంట్రో షాట్’ అంటూ రిలీజ్ అయిన ఓ వీడియో మాత్రం ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. ఏదేమైనా ఫ్యాన్స్ కోరిక మేరకైనా ఎన్టీఆర్ 30 అప్డేట్ ఇస్తారేమో చూడాలి.