అంతకు ముందు వరుస హిట్లతో ఫామ్లో ఉన్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే.. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో.. మరోసారి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. పూజాకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం పూజా చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కి భాయ్-కి సి కి జాన్’ సినిమాతో పాటు ‘సర్కస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో మహేష్-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అయితే ఎప్పుడో ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనలోను పూజనే హీరోయిన్గా తీసుకున్నారు. లైగర్ రిలీజ్ అవకముందే పూరి-విజయ్ దేవరకొండ ‘జెజిఎం’ సినిమాను మొదలు పెట్టారు.
అయితే లైగర్ రిజల్ట్ తారుమారవడంతో.. జనగణమన అటకెక్కిందని ప్రచారంలో ఉంది. దాంతో లైగర్ మూవీ పూజాకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ మరో వెర్షన్ ప్రకారం పూజా వల్లే జనగణమనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు కొందరు. అమ్మడి బ్యాడ్ సెంటిమెంటే అందుకు కారణమంటున్నారు. అంతేకాదు ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చిన హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్.. ‘భవదీయుడు భగత్ సింగ్’ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉంటుందో లేదో కూడా చెప్పలేమంటున్నారు. ఇందులోను పూజా పేరే వినిపిస్తోంది. ఇలా బుట్టబొమ్మ కమిట్ అయిన సినిమాలు నత్త నడకన ముందుకు సాగుతుండడమే కాదు.. మధ్యలోనే ఆగిపోతున్నాయి. దాంతో ఇదంతా పూజా ఐరన్ లెగ్ మహిమేనని ఇండస్ట్రీ టాక్. కారణాలు ఏమైనా పూజాకు మాత్రం నిజంగానే బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పొచ్చు.