ఇంటింటి రామాయణం (Intinti Ramayanam) సినిమా ట్రైలర్ ను డీజే టిల్లు’ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu jonnalagaḍḍa) రిలీజ్ చేశారు.మా ఇంటికి ఒక కథ అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే ‘ఇంటింటి రామాయణం’. సురేశ్ దర్శకత్వం (Directed by Suresh) వహించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) – నవ్య స్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ను బట్టే ఇది కామెడీని .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. మదీన్ (Madin) ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ – ప్రసాద్ ఐమ్యాక్స్ (Prasad IMAX) నిర్వహించారు. విలేజ్ డ్రామా నేపథ్యంలో వివిధ పాత్రల చుట్టూ తిరిగే ఫన్ అండ్ కూల్ ఎలిమెంట్స్ తో ఇంటింటి రామాయణం ఉండబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో.. IVY ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నవ్య స్వామి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నరేశ్ విజయ కృష్ణ, గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, బిత్తిరి సత్తి (Bittiri satti)ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.