దర్శక ధీరుడు రాజమౌళి వల్ల ఇప్పుడు హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిని తీసుకెళ్లాడు రాజమౌళి. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేలా హాలీవుడ్ స్టార్స్‌ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అందుకే అక్కడి బడా సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్ బాబుతో ‘గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వంచర్ ఫిల్మ్’ చేయబోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలో అమెరికాకి చెందిన ప్రముఖ ఏజెన్సీ సంస్థ ‘సీఏఏ’తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ ఏజెన్సీ మహేష్ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీ, నటులను అందించడమే కాదు
భారీగా ప్రమోట్ చేయనుందని చెప్పొచ్చు. అందులోభాగంగా SSMB29లో హాలీవుడ్ స్టార్స్ నటించే చాన్స్ ఉంది. తాజాగా ఇందులో ఓ హాలీవుడ్ స్టార్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ అని టాక్.
ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘శామ్యూల్ ఎల్ జాక్స్’ను మహేష్ కోసం రంగంలోకి దింపుతున్నారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కెప్టెన్ మార్వెల్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్.. వంటి హిట్ చిత్రాల్లో నటించిన శామ్యూల్‌కు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఒక్కో చిత్రానికి ఈ స్టార్ యాక్టర్ పారితోషికం 80 కోట్ల నుంచి 160 కోట్లు ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఒకవేళ ఈయనను మహేష్ సినిమాలో తీసుకుంటే మాత్రం.. రాజమౌళి హాలీవుడ్ టార్గెట్‌గా సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు.