NBK 108 : హిట్ సెంటిమెంట్.. డిసప్పాయింట్ చేసిన బాలయ్య!
NBK 108 : అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు నందమూరి బాలకృష్ణ. ఇదే ఊపులో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు. పటాస్ నుంచి F3 వరకు ఫన్ డోస్ ఎక్కువగా చూపించిన అనిల్.. ఈసారి బాలయ్యతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు నందమూరి బాలకృష్ణ. ఇదే ఊపులో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు. పటాస్ నుంచి F3 వరకు ఫన్ డోస్ ఎక్కువగా చూపించిన అనిల్.. ఈసారి బాలయ్యతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే.. అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి ఉంటుందంటూ.. ఉగాది కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇక ఈ లుక్.. బాలయ్య ఫ్యాన్స్‌కు అరుపులు పెట్టించేలా ఉంది. దిస్ టైం బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటూ.. బాలయ్యను రెండు షేడ్స్‌లో పవర్ ఫుల్‌గా చూపించాడు. గ్రే కలర్ గడ్డంతో, పదునైన మీస కట్టుతో బాలయ్య నయాల లుక్ అదిరిపోయింది. ఒక అభిమానిగా బాలయ్యను ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలా చూపించబోతున్నాడు అనిల్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కూతురిగా కనిపించబోతోంది. షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో అంచనాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. అఖండ, వీరసింహారెడ్డిలో లాగే డబుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య. దాంతో ఈ సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు నందమూరి ఫ్యాన్స్. అయితే టైటిల్ విషయంలో మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. ఎన్బీకె 108 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా నుంచి ఉగాది రోజు టైటిల్ అనౌన్స్ ఉంటుందని భావించారు. కానీ అఖండ, వీరసింహారెడ్డి సెంటిమెంట్ ఫాలో అవుతూ.. ముందుగా వర్కింగ్ టైటిల్‌తోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కానీ నెక్స్ట్ అప్డేట్ మాత్రం టైటిలే అంటున్నారు. అన్నట్టు ఈ సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ వినిపిస్తోంది.