సెన్సార్ బోర్ట్ నుండి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకుందంటే.. ఆ సినిమాలో బోల్డ్ కంటెంట్ అయినా ఉండాలి.. లేదా క్రైమ్ కంటెంట్ అంతకుమించి అనేలా ఉండాలి. అయితే ఇప్పుడు అడివిశేష్ ‘హిట్ 2’ మూవీకి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్‌తో.. క్రైమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో రక్తపాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించారు మేకర్స్.
అందుకే ఈ సినిమాకు ఆ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పొచ్చు. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేష్.. ఇటీవల ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తనదైన స్టైల్లో క్రైమ్ ఇన్విస్టిగేషన్ చేయబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్ 2’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ మూవీ ఫ్రాంచైజ్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
న్యాచురల్ స్టార్ నాని ప్రెజెంట్ చేస్తున్నఈ మూవీ.. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ‘హిట్ 2’కి ‘ఏ’ సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా నిడివి వచ్చేసి దాదాపు రెండు గంటలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అంతసేపు క్రైమ్ థ్రిల్లర్‌తో ఆకట్టుకోవాలంటే.. సాలిడ్ కంటెంట్‌తో పాటు.. ఇన్విస్టిగేషన్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండాలి.
లేదంటే సినిమా రిజల్ట్‌లో తేడా రావడం పక్కా. కానీ ఈ ప్రాజెక్ట్‌లో అడివి శేష్ ఉన్నాడు కాబట్టి.. ఖచ్చితంగా హిట్ 2.. హిట్ అని హోప్స్ పెట్టుకున్నారు ఆడియెన్స్. మరి ‘హిట్ 2’ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.