ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ మొదటి నుంచి వైవిధ్యంగా సాగుతున్నాడు అడివిశేష్. విభిన్న కథలతో సినిమాలు చేస్తు వస్తున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక ఇప్పుడు హిట్ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘హిట్ 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను.. డిసెంబర్ 2వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు అడివి శేష్. ఈ నేపథ్యంలో అడివి శేష్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. వరుస సక్సెస్‌లు అందుకోవడంతో.. అడివి శేష్ మార్కెట్‌తో పాటు పారితోషికం కూడా పెరుగుతూనే వస్తోంది.
ఈ ఏడాది మహేష్ బాబు ‘జిఎంబి’ ప్రొడక్షన్లో వచ్చిన మేజర్ మూవీ కోసం.. దాదాపు నాలుగు కోట్ల పారితోషికం అందుకున్నాట్టు సమాచారం. దాంతో ఇప్పుడు నాని నిర్మించిన హిట్ 2 సినిమాకు ఎంత తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే నాని కూడా అడివి శేష్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం..
హిట్ 2 కోసం అడివి శేష్ ఐదు కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో అడివి శేష్ కెరీర్లో అదే అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. ఇక ఈ అన్నపూర్ణ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు అడివి శేష్. అలాగే గూఢాచారి సీక్వెల్ కూడా చేయనున్నాడు. మరి హిట్2తో అడివిశేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.