త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్.. ఈ మధ్య కాలంలో మరో సినిమాపై రాలేదనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం రీషూట్ హాట్ టాపిక్‌గా మారింది.
చాలా కాలం డిలే తర్వాత ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram). ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు . అయితే మహేష్ సమ్మర్ వెకేషన్ కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ గ్యాప్‌లో గుంటూరు కారం పై ఎన్ని పుకార్లు రావాలో అన్ని వచ్చేశాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఔట్ అయ్యాడనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో నిజం లేదు కానీ.. హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) మాత్రం సైడ్ అయిపోయిందని సమాచారం. దీంతో ఇప్పటికే పూజా హెగ్డే పై షూట్ చేసిన కొన్ని సీన్స్ వేస్ట్ అయ్యాయి.
అంతేకాదు పూజా ప్లేస్‌లోకి శ్రీలీల(Srileela) రాగా.. శ్రీలీల ప్లేస్‌లోకి హిట్2 సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి(meenakshi Choudary)ని తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో గుంటూరు కారం(Guntur Karam Movie) లేటెస్ట్ షెడ్యూల్ రీ షూట్‌తోనే సరిపోతుందని టాక్. ఇప్పటి వరకు పూజా హెగ్డే పై షూట్ చేసిన సీన్స్‌ను, మళ్లీ శ్రీలీల పై రీషూట్ చేస్తున్నారట. అలాగే శ్రీలీల పై షూట్ చేసిన సీన్స్‌ను మీనాక్షి చౌదరి పై షూట్ చేస్తున్నారట. రీసెంట్‌గానే మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు.
ప్రజెంట్ హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో రీషూట్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఇప్పటికే సమ్మర్ నుంచి సంక్రాంతికి షిప్ట్ అయింది గుంటూరు కారం(Guntur Karam Movie). దానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. కరెక్ట్ టైంలోనే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక హారిక హాసిని బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. తమనే ఫైనల్‌గా మ్యూజిక్ అందిస్తున్నాడు.