వెబ్ సిరీస్ : గన్స్ అండ్ గులాబ్స్ నటీనటులు:రాజ్‌కుమార్ రావ్, దుల్కర్ సల్మాన్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్, సతీష్ కౌశిక్, పూజా గోర్, శ్రేయ ధన్వంతరి, విపిన్ శర్మ తదితరులు సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్, ఎడిటింగ్: సుమీత్ కొటియాన్ రచన:సుమిత్ అరోరా, సుమన్ కుమార్ సంగీతం: అమన్ పంత్ దర్శకత్వం: కృష్ణ డీకే, రాజ్ నిడిమోరు ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ రిలీజ్:18 ఆగస్ట్ 2023
Guns And Gulaabs Web Series Review: రాజ్ అండ్ డీకే గన్స్ అండ్ గులాబ్స్ (Guns And Gulaabs) సిరీస్‌ను ప్రేక్షకులు మందుకు తీసుకొచ్చారు. ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ సిరీస్ తర్వాత తీసిన సిరీస్ ఇదీ.. గ్యాంగ్ స్టర్, స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతోంది. ఆ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. పదండి.
కథ ఏంటంటే..?
గులాబ్ గంజ్‌లో (gulab gunj) టిప్పు (రాజ్‌కుమార్ రావ్) బైక్ మెకానిక్.. అతని తండ్రి స్మగ్లర్.. ఒకరోజు హత్యకు గురవుతాడు. టిప్పు కూడా రెండు హత్యలు చేస్తాడు. తాను కూడా తండ్రిలా మారతాడని అనుకొని ఊరి నుంచి వెళ్లిపోవాల్సిన అనుకుంటాడు. అర్జున్ వర్మ (దుల్కర్ సల్మాన్) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే పోలీస్ అధికారి. బదిలీపై గులాబ్ గంజ్ వచ్చిన ఆయన.. నల్లమందు అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని అనుకుంటాడు. గాంచి (సతీశ్ కౌశిక్) ధనవంతుడు.. నల్లమందు అక్రమ రవాణా చేస్తుంటాడు. అతని కుమారుడు జుగ్ను (ఆదర్శ్ గౌరవ్) తండ్రి స్థానంలోకి రావాలని అనుకుంటాడు. నెల రోజుల్లో పెద్ద మొత్తంలో నల్లమందు ఇస్తానని కొందరు వ్యక్తులతో గాంచి డీల్ చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా ప్రమాదానికి గురవుతాడు. నల్లమందు అక్రమ రవాణా చేయాల్సిన బాధ్యత జుగ్నుపై పడుతోంది. అర్జున్ వర్మ నుంచి ఎలా తప్పించుకున్నాడు. టిప్పు మళ్లీ ఊరు ఎందుకు వస్తాడనేదే వెబ్ సిరీస్ కథ.
ఎలా ఉందంటే..?
గన్స్ అండ్ గులాబ్స్ (Guns And Gulaabs) వెబ్ సిరీస్ కథ.. 90వ దశకంలో జరిగిన కథ. పగ, ప్రతీకారం, ఆధిపత్య పోరు, పేరు ప్రఖ్యాతలు మనిషి చుట్టూ తిరుగుతాయి. సిరీస్‌లో ప్రతీ రోల్ వీటిని సాధించడం కోసం పరితపిస్తాయి. సిరీస్‌లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉండటం కాస్త బోరింగ్‌గా ఉంటుంది. స్నేహితుడిని చంపిన వారిని అంతం చేసేందుకు టిప్పు ప్రయత్నాలు చేస్తాడు. తండ్రి స్థానంలోకి వచ్చేందుకు జుగ్ను పాట్లు పడతాడు. నల్లమందు అక్రమ రవాణా అడ్డుకునేందుకు అర్జున్ పోరాటం చేస్తాడు. ఐదు, ఆరు ఎపిసోడ్స్ కాస్త ఫర్లేదు. లాస్ట్ ఎపిసోడ్ సాగదీతగా ఉంటుంది. చివరలో ఉన్న ట్విస్ట్.. సీజన్-2 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఎవరెలా చేశారంటే..?
రాజ్ కుమార్ రావు నటన చాలా నాచురల్‌గా ఉంది. అతని హావభావాలు ఆకట్టుకుంటాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ ఒదిగిపోయాడు. గుల్షన్ దేవయ్య పాత్ర డిఫరెంట్‌గా తీర్చిదిద్దారు. అతని హెయిర్ స్టైల్ 90వ దశకం నాటి సంజయ్ దత్‌ను గుర్తుకుతెచ్చారు. జుగ్ను పాత్రలో ఆదర్శ్ గౌరవ్ ఫర్లేదు అనిపించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. 90 కాలాన్ని తీసుకొచ్చేందుకు కష్టపడ్డారు. ఫ్లేమ్స్ ఆడటం, క్యాసెట్స్‌లో పాటలు వినడం, ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసే సీన్స్ ఆ కాలాన్ని గుర్తుచేస్తాయి. విజువల్ కంటెంట్ బాగుంది. మ్యూజిక్ ఆకట్టుకుంది. నిడివి ఎక్కువ ఉండటం మైనస్‌గా మారింది.
ఫైనల్‌గా
ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ సిరీస్‌లు సూపర్ హిట్ అయ్యాయి. అందులో కథ, కథనం ప్రేక్షకులను కనురెప్ప వాల్చనీయవు. ఆ తర్వాత డీకే నుంచి వచ్చిన సిరీస్ అంటే ఆ మాత్రం హైప్ ఉంటుంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయారు. మంచి నటీనటులు ఉన్న.. కథ, కథనం అంతగా ఇంప్రెస్ చేయలేదు.
+
దుల్కర్, రాజ్‌కుమార్ రావు యాక్టింగ్
సినిమాటోగ్రఫీ, సంగీతం