Grand Re-Release : గ్రాండ్‌గా RRR రీ రిలీజ్.. ఎన్ని థియేటర్లలో తెలుసా!?
Grand Re-Release : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. కేరాఫ్ సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. జపాన్‌లో ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అక్కడ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. కేరాఫ్ సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. జపాన్‌లో ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అక్కడ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా రాబట్టి.. ఓటిటిలో హాలీవుడ్‌ను షేక్ చేసి.. ఇప్పుడు అవార్డుల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు ఆర్ఆర్ఆర్కు వచ్చిన అవార్డులైతే లెక్కే లేదు.. ఎంత గొప్ప అవార్డ్ అయినా సరే ఆర్ఆర్ఆర్ రేసులో ఉండాల్సిందే. అలాగే మన స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్స్‌గా నామినేట్ అవుతునే ఉన్నారు. తాజాగా ప్రముఖ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా ‘బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ’ క్యాటగిరి నామినేషన్స్‌లో నిలిచారు. ఈ లిస్ట్‌లో హాలీవుడ్ దిగ్గజ నటులైన టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ వంటి వారితో చరణ్, ఎన్టీఆర్ పోటీ పడడం ఎంతో గొప్ప విశేషం అనే చెప్పాలి. మార్చి 16న ఈ అవార్డ్ ఫైనలైజ్ ఉంటుంది. అయితే ఈలోపే ఆస్కార్ కూడా కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 12న నాటు నాటు సాంగ్ ఆస్కార్ కొట్టేసి.. చరిత్ర సృష్టించడం పక్కా. అందుకే ట్రిపుల్ ఆర్ మూవీని మరోసారి భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 3న అమెరికాలో ఏకంగా 200 థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ అవార్డ్స్‌కు వారం రోజులు ముందుగా.. ఆర్ఆర్ఆర్ను అంత భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడం విశేషం. ఏదేమైనా ట్రిపుల్ ఆర్ మూవీ ప్రతి తెలుగోడు గర్వించేలా చేస్తోంది.