బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అవకాశాల్లేక బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో కుటుంబసభ్యులు కూడా ఎంతో బాధకు గురయ్యారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.