‘కాంతార’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సినిమాలో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆయనలా ఎవరూ ఆలోచించలేరని, దూరదృష్టి ఉన్న దర్శకుడని చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.