ప్రస్తుతం మహేష్ బాబు తన అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. మొన్నటి వరకు బాధలో ఉన్న మహేష్‌ను చూసి.. కాస్త కంగారు పడిన ఫ్యాన్స్.. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్‌గానే మహేష్ వర్క్ మూడ్‌లోకి వచ్చేశాడు. ఓ యాడ్ షూట్లో కూడా పాల్గొంటున్నాడు. అలాగే తమన్, త్రివిక్రమ్‌తో కలిసి ఎస్ఎస్ంబీ 28 మ్యూజిక్ సిట్టింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా బయటకొచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహేష్, త్రివిక్రమ్, థమన్ కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటో వైరల్‌గా మారింది. దాంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక మరో విషయంలో కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే పలు సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహేష్.. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా రెండు సంవత్సరాల మోహిత్ సాయి అనే చిన్నారికి గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు.. మహేష్ బాబు ఫౌండేషన్ తెలిపారు. ఇదిలా ఉండగానే.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ న్యూస్ మరింత వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అందుకే కె.ఎల్ నారాయణతో పాటుగా హాలీవుడ్ మేకర్స్‌ని ఈ ప్రాజెక్ట్‌లో తీసుకుంటున్నట్టు టాక్. పాన్ వరల్డ్ మార్కెట్‌కు ఇది మరింత కలిసొస్తుందని భావిస్తున్నారట. అలాగే హాలీవుడ్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుపుతున్నారట జక్కన్న. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యీపీ అంటున్నారు.