ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వేరు. ఆయన కటౌట్‌కి మాస్ సినిమాలు పడితే.. బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉంటాయి. ఈ ఏడాదిలో అదే జరగబోతోంది. ముందుగా జూన్ 16న ఆదిపురుష్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మాస్ కా బాప్ వస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత వెంటనే జనవరి 12 ‘ప్రాజెక్ట్ కె’ రానుంది. ఇలా ఏడు నెలల గ్యాప్‌లో మూడు భారీ సినిమాలతో ఆడియెన్స్ ముందుకి వస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాల తర్వాత సాలిడ్ లైన్ సెట్ చేసుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నాడట. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుంది.? ప్రభాస్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేసి చాలా కాలం అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా.. ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటున్నాయి. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె అయిపోయిన తర్వాత.. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఆ తర్వాత పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాల మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇది హార్రర్ బ్యాక్ డ్రాప్లో వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. అయినా కూడా ప్రభాస్ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. గతంలో ప్రభాస్ చేసిన సినిమాల్లో.. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంచి ఫ్యామిలీ సినిమాలుగా నిలిచాయి. మిర్చిలో ఫ్యామిలీ డ్రామా ఉన్నప్పటికీ.. యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యామిలీ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజును సెట్ చేయమని ప్రభాస్ కోరినట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పటికే దిల్ రాజు.. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. దాంతో దిల్ రాజు బ్యానర్లో ప్రభాస్ చేసే సినిమా ఫ్యామిలీ మూవీనా? యాక్షన్ మూవీనా? అనేది కన్ఫ్యూజన్లో పడేసింది. అయితే ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ స్టోరీ ఉండాలి. లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్‌కు ఇది రిస్కీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అయితే ఇలాంటి విషయాల్లో దిల్ రాజు దిట్ట కాబట్టి.. ప్రభాస్ నుంచి సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చినా రావొచ్చు. చూడాలి ఏం జరుగుతుందో!