మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మధ్య సంక్రాంతి వార్ ఏ రేంజ్లో ఉండబోతోంది. ప్రతి విషయంలోను ఈ ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ వార్ జరుగుతోంది. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా.. తాజాగా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాటతో..
థియేటర్లో మాస్ జాతరే అంటున్నారు మెగాభిమానులు. బాస్ వస్తుండు.. అంటూ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని అంటున్నారు. ఇక మెగాస్టార్ లుంగీలో వేసిన మాస్ స్టెప్పులు దుమ్ము దుమారమే అంటున్నారు. ఇటీవల కాలంలో మెగాస్టార్‌కు సరైన మాస్ ఐటెం పడిందంటున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా గ్లామర్ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.
మొత్తంగా దేవిశ్రీ డీజే సౌండ్ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇక దేవిశ్రీ కుమ్మేశాడు కాబట్టి.. ఇప్పుడు అందరి దృష్టి వీరసింహారెడ్డి పై పడింది. ఎందుకంటే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అసలే టాలీవుడ్లో దేవిశ్రీ వర్సెస్ తమన్‌గా ఉంది.. దాంతో బాలయ్య కోసం తమన్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడనే ఆసక్తి అందరిలోను ఉంది. పైగా అఖండతో బాక్సులు బద్దలు చేశాడు తమన్..
అందుకే వీరసింహారెడ్డి ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే.. ‘జై బాలయ్య’ అంటూ సాగే పాటను నవంబర్ 25న ఉదయం10:29 గంటలకు విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘రాజసం నీ ఇంటి పేరు’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలకృష్ణ లుక్ అదరహో అనేలా ఉంది. మరి బాలయ్య కోసం తమన్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో తెలియాలంటే.. ఇంకొన్ని గంటు ఆగాల్సిందే.