మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకున్న ఓ యంగ్ డైరెక్టర్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ(vijay deverakonda)తో ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం రౌడీ హీరో ‘ఖుషి’ అనే సినిమలో నటిస్తున్నాడు. లైగర్ హిట్ అయితే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా షూటింగ్ జరుపుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. దాంతో ఖుషి తర్వాత రౌడీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి(gowtam tinnanuri) విజయ్ ఓకే చెప్పాడని సమాచారం.
హిందీ ‘జెర్సీ’ తర్వాత చరణ్ దగ్గర లాక్ అయ్యాడు గౌతమ్. ప్రజెంట్ చరణ్ ‘ఆర్సీ 15’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గౌతమ్‌తో ప్రాజెక్ట్ ఉంటుందని వినిపించింది. అయితే ఈ మధ్యలో ఆర్సీ 16ని పక్కన పెట్టేసినట్టు టాక్. ఇంకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ గౌతమ్ తిన్ననూరి మాత్రం మరో హీరోతో ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులోభాగంగా రీసెంట్గా గౌతమ్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్.
దాంతో పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడట గౌతమ్. అయితే విజయ్‌కు చెప్పిన కథ చరణ్‌దేనా.. లేక మరో స్టోరీతో ఈ యంగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. కానీ విజయ్ దేవరకొండతో.. గౌతమ్ తిన్ననూరి సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.