మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఆటోమేటిక్‌గా జనాలను థియేటర్‌కి రప్పించొచ్చు. ఇటీవల వచ్చిన కాంతార సినిమానే అందుకు నిదర్శనం. మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. ఇదే స్ట్రాటజీతో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ టుడే’ని తెలుగులో రిలీజ్ చేశారు నిర్మాత దిల్ రాజు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. పోయిన వారం థియేటర్లలోకి వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పటి వరకూ 7, 8 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. లాంగ్ రన్లో 10 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఇవానా క్యూట్ లుక్‌తో కట్టిపడేసింది. తెలుగు కుర్రాళ్లు అమ్మడికి అందానికి ఫిదా అవుతున్నారు. దాంతో ఇవానా తెలుగులో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజునే ఇవానాకి తెలుగులో ఫస్ట్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. ఈ సినిమా తర్వాత దిల్ రాజు, సుకుమార్ కలిసి ఆశిష్‌తో ‘సెల్ఫిష్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. లవ్ టుడేతో ఇవానాకు తెలుగులో మంచి క్రేజ్ రావడంతో.. సెల్ఫిష్ చిత్రంలో హీరోయిన్గా ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ సినిమాలోని రంజితమే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఇవానా స్టెప్పులేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.