గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.