నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో హీరో రవితేజ భాగం కాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తన వాయిస్ ఓవర్‌తో బాలయ్య పాత్రను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది మూవీపై హైప్‌ను పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.