పెద్ద పండగలు వస్తున్నాయి అంటే కచ్చితంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్ లోకి అడుగుపెడుతూ ఉంటాయి. ఈ దసరా పండగకి కూడా ముగ్గురు హీరోలు వచ్చారు. భగవంత్ కేసరిగా బాలయ్య, లియో తో విజయ్, టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ మూడు సినిమాల్లో దసరా విజేత ఎవరు..? ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కాసుల వర్షం కురిపించిందో చూద్దాం.
దసరా పండగకు రిలీజ్ అయిన సినిమాల్లో ‘లియో’ కూడా ఒకటి. ఇది బహుభాషా డబ్బింగ్ చిత్రం కావడం విశేషం. ఇది ఆంధ్రా మినహా అన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కును సాధించింది. త్వరలో ఆంధ్రాలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించనుంది. ట్రేడ్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. ఇక ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్స్ విషయానికి వస్తే మాస్ అండ్ యాక్షన్ డోస్‌గా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు విడుదలైంది. యూత్ ఆడియన్స్, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి లియో మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. దీంతో భగవంత్ కేసరి మూవీ ఇప్పటికే రూ.100కోట్లు దాటేసింది. దీంతో దసరా విజేతగా భగవంత్ కేసరి అనే టాక్ వినపడుతోంది.