»Chiranjeevi In The Family Man Series Ashwini Dutts Comments Are Viral
‘The Family Man’ సిరీస్‌లో చిరంజీవి.. అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ వెబ్ సిరీస్‌ను వదులుకున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించి ఉంటే ఆ లెక్క వేరే ఉండేది. చిరు మాత్రం ఈ సెన్సేషన్ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Chiranjeevi in 'The Family Man' series.. Ashwini Dutt's comments are viral
‘The Family Man: ఈ మధ్య స్టార్ హీరోలంతా వెబ్ సిరీస్‌లు చేస్తూ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలె వెంకటేష్ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేశాడు. సెకండ్ సీజన్ ఇంకా రిలీజ్ అవాల్సి ఉంది. గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఓటీటీ ప్రయత్నాలు జరిగాయని తాజాగా తెలిసింది. 2019లో అమెజాన్ ఒరిజినల్‌గా వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ భార్య పాత్రలో నటించగా.. మనోజ్ అండర్ కవర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా నటించాడు.
సీజన్ వన్ అప్పట్లో హ్యూజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో సీజన్ 2 చేశారు. ఇందులో సమంత కీ రోల్ ప్లే చేసింది. ఈ సిరీస్‌తో సమంత క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. మొత్తంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రెండు సీజన్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముందుగా ఈ సిరీస్‌ను చిరంజీవి కోసం రాశారట రాజ్ అండ్ డీకే. ఇదే విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరు రీ ఎంట్రీ ఫిల్మ్ ఖైదీ నెం.150 బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ సిరీస్‌లో ఇద్దరు పిల్లలకి తండ్రి అంటున్నారు.. ఇప్పుడే ఇలాంటి సబ్జెక్ట్స్ అవసరమా? అని ఈ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేశాడట మెగాస్టార్. దీంతో ఈ ప్రాజెక్ట్ మనోజ్ బాజ్‌పాయ్ దగ్గరికి వెళ్లడం.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సంచలనంగా నిలవడం జరిగిపోయాయి. ఒకవేళ చిరు ఈ సిరీస్ చేసి ఉంటే ఆ లెక్కలు వేరేలా ఉండేవి. కానీ రీ ఎంట్రీ జోష్‌లో దీన్ని పట్టించుకోలేదు చిరు. ఏదేమైనా చిరు మాత్రం ఓ సెన్సేషన్ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.