ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ హై ఓల్టేజ్ ఫిల్మ్ థియటర్లోకి రావడానికి ఇంకో సంవత్సరానికి పైగా సమయం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సలార్ షూట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కెజియఫ్ చాప్టర్ 2 తర్వాత.. సలార్ సినిమాను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సలార్‌ను రిలీజ్ చేయనున్నారు. అయితే వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి.. ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే సలార్ షూట్ కోసం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టారు.
అయితే రీసెంట్గా ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం.. ప్రభాస్‌నే కాదు ఇండస్ట్రీ మొత్తాన్ని ఎంతగానో కలిచివేసింది. దాంతో ప్రస్తుతం ప్రభాస్ కుటుంబ సభ్యులతోనే తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. కాబట్టి ఇంకొన్ని రోజులు ప్రభాస్ షూటింగ్‌కి హాజరయ్యే పరిస్థితి కనిపిండంలేదు. ఈ క్రమంలో సలార్ లేటెస్ట్ షెడ్యూల్‌ను పోస్ట్ పోన్ చేసి.. రీ షెడ్యూల్ చేసే ఆలోచలనలో ఉన్నారు మేకర్స్. కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి అక్టోబర్‌లో తిరిగి షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్క సలార్ మూవీ మాత్రమే కాదు.. ‘ప్రాజెక్ట్ కె’కు కూడా బ్రేక్ తప్పదని చెప్పాలి. ఇక సలార్‌లో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మళయాళ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏదేమైనా కృష్ణంరాజు మరణం.. ప్రభాస్‌కు తీరని లోటు అనే చెప్పాలి.