అఖండ తర్వాత అన్‌స్టాపుబుల్ షో దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అలాగే ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా కూడా చేస్తున్నారు.మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో బ్యాలెన్స్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు బాలయ్య. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో 108వ సినిమాగా రానుంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగమ్మాయి అంజలి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆ మధ్యలో ప్రియమణి పేరు వినిపించగా.. రీసెంట్గా త్రిషను అనుకున్నారు. కాకపోతే త్రిష భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్.
అందుకే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నారట. అందుకే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు సమాచారం. గతంలో సౌత్‌లో రజినీకాంత్ సరసన ‘లింగా’ అనే సినిమాలో నటించింది సోనాక్షి. ఆ తర్వాత మరో సౌత్ మూవీ చేయలేదు అమ్మడు. అయితే ఇప్పుడు బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపుగా సోనాక్షి ఫైనల్ అయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.