తిరుపతి విమానాశ్రయ రోడ్డులోని IIDT భవనంలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. విద్యార్థులు, స్టార్టప్స్, వ్యాపారవేత్తలకు నూతన అవకాశాలు కలిగించేందుకు ఈ హబ్ దోహదపడుతుందని చెప్పారు.