బిగ్ బాస్8 హౌస్‌లో 3వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభయ్ నిన్న ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వెళ్లిన మూడు వారాల తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ప్రారంభంలో అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ భావించినా.. గేమ్స్, టాస్క్‌లలో ఎఫెక్టివ్‌గా ఆడలేకపోయారు. దీంతో అతనికి తక్కువ ఓటింగ్ వచ్చింది. కాగా, మూడు వారాలకు ఆరు లక్షల రూపాయలను అభయ్ రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం.