»Bhojpuri Actress Akanksha Dubey Suicide In Varanasi Hotel Room
Actress Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం..యంగ్ హీరోయిన్ ఆత్మహత్య
ఆకాంక్ష దూబే(Akanksha Dubey) 1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో పుట్టింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలు పంచుకునేది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆత్మహత్య(Suicide)కు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్(Pawan Singh)తో కలిసి ఆమె నటించింది. ఆ పాటనే ఆకాంక్ష చివరిసారిగా పోస్టు చేసింది.
సినీ పరిశ్రమ(Movie Industry)లో మరో విషాదం చోటుచేసుకుంది. భోజ్‌పూరి(Bhojpuri) యువ హీరోయిన్ ఆకాంక్ష దూబే(Akanksha Dubey) ఆదివారం సూసైడ్ చేసుకుంది. 25 ఏళ్ల ఆకాంక్ష ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ హోటల్లో ఉరి వేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఆకాంక్ష హోటల్ కు చేరుకుంది. సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమేంద్ర హొటల్లో ఆకాంక్ష ఉరి వేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంది.
ఆకాంక్ష దూబే(Akanksha Dubey) 1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో పుట్టింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలు పంచుకునేది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆత్మహత్య(Suicide)కు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్(Pawan Singh)తో కలిసి ఆమె నటించింది. ఆ పాటనే ఆకాంక్ష చివరిసారిగా పోస్టు చేసింది.
భోజ్‌పురి(Bhojpuri)లో ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ వంటి సినిమాల్లో ఆకాంక్ష నటించి మెప్పించింది. ఈ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే చాలా కాలంగా సమర్ సింగ్‌తో రిలేషన్షిప్లో ఉందని తెలుస్తోంది. సమర్ సింగ్‌పై తనకున్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టేది. అయితే ఆకాంక్ష దూబే(Akanksha Dubey) ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.