హీరో కార్తీకాయ చాలా రోజుల నుంచి హిట్టు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో నేడు(ఆగస్టు 25న) విడుదలైన బెదురులంక 2012 మూవీ ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది తెలుసుకుందాం.
చిత్రం:బెదురులంక 2012 నటీనటులు:కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని, తదితరులు రచన & దర్శకత్వం: క్లాక్స్ నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంగీతం:మణి శర్మ సినిమాటోగ్రఫీ:సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి బ్యానర్:లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సహ నిర్మాతలు:అవనీంద్ర ఉపద్రస్తా & వికాస్ గున్నాల విడుదల తేదీ:ఆగస్టు 25, 2023
కార్తికేయ, నేహా శెట్టి యాక్ట్ చేసిన బెదురులంక 2012 చిత్రం ఈ రోజు(ఆగస్టు 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. అన్ని హైప్‌ల నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా స్టోరీ ఎంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
కథ:
బెదురులంక అనే పల్లెటూరి గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. 2012లో ప్రపంచం అంతం అవుతుందేమోనని ఆ గ్రామ ప్రజలు భయపడుతుంటారు. అయితే ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ అజయ్ ఘోష్ పోషించిన గ్రామపెద్ద ఇద్దరు నకిలీ దేవతలను సృష్టించి గ్రామస్తులను భయపెట్టి వారి నగలు దోచుకోవాలని ప్లాన్ వేస్తాడు. కానీ అదే గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) అనే యువకుడు దానిని వ్యతిరేకిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ చిత్రతో (నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు. దీంతోపాటు వారిని అడ్డుకుని గ్రామంలో శాంతిని నెలకొల్పేందుకు హీరో ఏం చేసాడు? చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ.
విశ్లేషణ
ఓ గ్రామంలో డిసెంబర్ 2012 శకం ముగిసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ సమయంలోనే భూషణం(అజయ్ ఘోష్) బెదురులంక గ్రామంలో ఓ ప్లాన్ వేస్తాడు. గ్రామంలోని బ్రాహ్మణుడైన బ్రహ్మ్ (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (రామ్ ప్రసాద్)తో కలిసి ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అంతేకాదు ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ)కి యుగాంతం ఆపాలంటే పట్టణంలోని బంగారమంతా కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదలమని ప్రజలను నమ్మిస్తాడు. దీంతో ఊరు ఊరంతా భయాందోళనకు గురవుతారు. కానీ శివ (కార్తికేయ) అందుకు ఒప్పుకోడు. అయితే శివ అప్పటికే ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర (నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలోనే ప్రెసిడెంట్ మాటలను ధిక్కరించినందుకు గాను శివను గ్రామం నుంచి గెంటేస్తారు. ఆ నేపథ్యంలో శివ ఏం చేస్తాడు? ఊరి ప్రజల మూఢ నమ్మకాలు పోగొట్టేందుకు ఎలా ప్రయత్నిస్తాడు? తన ప్రేమను ఏ విధంగా కాపాడుకుంటాడు? యుగాంతం నుంచి గ్రామ ప్రజలకు విముక్తి ఎలా కలిగిందో తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మనిషిలో భయాన్ని ఎలా ఉపయోగించాలి? మతం పేరుతో మనుషులను ఆడుకోవడం ఎలా? వారు ఎంత సులభంగా మోసం చేస్తారు? ఈ దర్శకుడు ఏ సందేశం చెప్పాలనుకున్నా, అంతర్లీనంగా ఉండే ఈ సందేశం బెదురులంక చిత్రంలో కనిపిస్తుంది. మూఢ నమ్మకాలపై సెటైర్‌గా ఈ సినిమా కనిపిస్తుంది. దేవుడిపై భక్తి కంటే భయమే ఎక్కువగా కనిపిస్తుందని హీరో చెప్పిన డైలాగ్‌లో చాలా అర్థం ఉందనిపిస్తుంది. మూఢనమ్మకాలతో నిండిన మనుషులను మార్చడం ఎంత కష్టమో ఈ చిత్రంలో చక్కగా చూపించారు. దర్శకుడు మంచి సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకుడు సగం మాత్రమే సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు కథ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుంది. పల్లెటూరి వాతావరణం, పల్లెటూరిలో భిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తుల పరిచయం, హీరో ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. గోదావరి జిల్లాల యాస, అక్కడి సెటైర్లు కొన్నిచోట్ల నవ్విస్తాయి. మరోవైపు హీరో, హీరోయిన్ల ట్రాక్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు కారణం ఏంటో చూపించరు. చిన్నప్పటి నుంచి ప్రేమ అంటుంటారు. కానీ ఒక్క సీన్లోనూ ఆ డెప్త్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు చాలా వరకు నవ్వించాడు. పల్లెటూరి వ్యక్తుల పాత్రలో శివ నటించే విధానం, చనిపోతున్నాడని తెలియగానే మనిషిలో వచ్చే మార్పులు ఇలా చాలా అంశాల్లో సెకండాఫ్ మెరుగ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ మరింత నవ్వించేలా చేస్తుంది.
సాంకేతిక అంశాలు
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు మణిశర్మ అందించిన పాటలు ఓకే. అయితే ఆర్ఆర్ అయితే పర్వాలేదు. కెమెరా వర్క్, ఆర్ట్‌వర్క్, ఎడిటింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు బాగానే పనిచేశాయి. సినిమా చాలా షార్ప్‌గా కట్ చేసినట్లు అనిపిస్తుంది. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. మతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఒక పాట బాగుంటుంది. మిగతా పాటలు పెద్దగా గుర్తుండిపోయేవిగా అనిపించవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఎవరెలా చేశారు
హీరో కార్తికేయ శివ పాత్రలో చాలా ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేశారు. అతను తన ఫిట్నెస్ను మెయింటెయిన్ చేస్తున్నాడని చూపించడానికి తరచుగా చొక్కా లేని సీన్లలో కనిపిస్తాడు. దీంతోపాటు యాక్షన్, కామెడీ సన్నివేశాల్లో బాగానే నటించాడు. ఇక హీరోయిన్ నేహా శెట్టి గ్లామరస్ డాల్ గా మెప్పించింది. కొన్ని చోట్ల రొమాంటిక్ సీన్స్ లలో కూడా ఆకట్టుకుంది. దీంతోపాటు అజయ్ ఘోష్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్ పాత్రల్లో వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు. సత్య, వెన్నెల కిషోర్, కాశిరాజుగా కనిపించిన రాజ్‌కుమార్ కసిరెడ్డి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
+స్టోరీ
+నటీనటుల యాక్టింగ్
+కొన్ని కామెడీ సీన్లు
+సెకండాఫ్
+నిర్మాణ విలువలు